Templates by BIGtheme NET
Home >> Cinema News >> సౌందర్య బయోపిక్.. నటించేది ఆమేనా!

సౌందర్య బయోపిక్.. నటించేది ఆమేనా!


సావిత్రి ‘మహానటి’తోనే తెలుగులో బయోపిక్ లపై క్రేజ్ మొదలైందని చెప్పాలి. ఈ సినిమా తర్వాతనే నందమూరి తారకరామారావు బయోపిక్ వచ్చింది. ఆ తర్వాత పలు బయోపిక్ లు చర్చలోకి వచ్చాయి. వీటిలో హీరోయిన్లకు సంబంధించి అందాల తార సౌందర్య అతిలోకి సుందరి శ్రీదేవి బయోపిక్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి.

తెలుగు సినిమా వినీలాకాశంలో ఒక తారగా వచ్చిన సౌందర్య.. అనతి కాలంలోనే జాబిలమ్మలా ఎదిగారు. షార్ట్ స్పాన్ లోనే వంద సినిమాల మైలురాయిని చేరుకున్నారు సౌందర్య. ఇందులో ఎన్నో మరపురాని సినిమాలు క్లాసిక్స్ అనదగ్గ చిత్రాలున్నాయి. నిజానికి సావిత్రి తర్వాత.. ఆ స్థాయి హీరోయిన్ గా కీర్తి పొందారు.

అయితే.. ఆమె బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే మాత్రం తాను వదులుకోను అంటూ.. సందర్భం వచ్చినప్పుడుల్లా ప్రస్తావిస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక. సౌందర్య శ్రీదేవి బయోపిక్ లలో నటించడం తన డ్రీమ్ అన్నట్టుగా చెబుతోంది రష్మిక మందన్న. వీళ్లిద్దరికి సంబంధించిన ప్రాజెక్టుతో ఎవరు వచ్చిన ఓకే చెప్పేస్తానంటోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు పలు ప్రాజెక్టులు కూడా ఈ అమ్మడి కిట్ లో ఉన్నాయి. మరి తరచూ ఈ బయోపిక్ ల ప్రస్తావన ఎందుకు తెస్తోందీ? ఎవరైనా.. ఈ ప్రాజెక్టులు చేపట్టడానికి సిద్ధమవుతున్నారా? కాబట్టే.. ముందుగానే కర్చీఫ్ వేస్తోందా? అన్నది తెలియాల్సి ఉంది.