Templates by BIGtheme NET
Home >> Cinema News >> గుడ్ బాయ్ చెబుతున్న రష్మిక మందన..!

గుడ్ బాయ్ చెబుతున్న రష్మిక మందన..!


టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా వెలిగిపోతోంది రష్మిక మందన. కన్నడ రంగం నుంచి వచ్చిన ఈ బ్యూటీ నెమ్మదిగా టాలీవుడ్ లో పాగా వేసి ఇప్పుడు బాలీవుడ్ లోనూ పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. ఆ క్రమంలోనే ఈ అమ్మడు టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేయబోతోందని తాజాగా ప్రచారం సాగిపోతోంది. ఇది నిజమా అన్నది తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాలి.

నిజానికి రష్మిక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిటవ్వడమే ఈ ప్రచారానికి కారణం. రష్మిక మందన నటిస్తున్న అప్ కమింగ్ హిందీ మూవీ టైటిల్ గుడ్ బాయ్ కావడం కూడా ఈ తరహా ప్రచారానికి కారణం. ఒకవేళ నిజంగానే ఈ సినిమా హిట్ అయితే మాత్రం తెలుగుకి ఈ బ్యూటీ దూరం అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి అంటూ అప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే రష్మిక వైపు నుంచి వెర్షన్ వేరేగా ఉంది. ఈ అమ్మడికి చాలా కాలంగా బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా ఓ పట్టాన అంగీకరించడం లేదు. ఇంతకుముందు షాహిద్ కపూర్ సరసన తెలుగు బ్లాక్ బస్టర్ జెర్సీ రీమేక్ లో నటించే అవకాశం వరించింది. కానీ రష్మిక ఆ సినిమాని కాదని అనుకుంది. ఆ క్రమంలోనే రష్మిక స్థానంలో సూపర్ 30 బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని ఆ అవకాశం వరించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే హిందీ జెర్సీ ఆఫర్ వదులుకున్న రష్మిక వెంట వెంటనే సిద్ధార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాలకు సంతకాలు చేసింది. ఇక టాలీవుడ్ నుంచి నిష్క్రమిస్తోంది అన్న ప్రచారం అసంబద్ధం. ఈ బ్యూటీ ఇక్కడ పుష్ప లాంటి భారీ చిత్రంలో నటిస్తోంది. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీకి రష్మిక పేరు ప్రపోజల్స్ లో ఉంది. ప్రస్తుతానికి ఈ చిత్రం హోల్డ్ లో ఉందని సమాచారం. అలాగే రామ్ చరణ్ – శంకర్ మూవీలోనూ రష్మిక నటిస్తోంది అంటూ ప్రచారం ఉంది. కాబట్టి ఇప్పట్లో తెలుగు పరిశ్రమను రష్మిక వదిలి పెట్టదనడంలో సందేహమేం లేదు. ప్రస్తుతానికి తెలివైన రష్మిక తెలుగు-తమిళం- హిందీ పరిశ్రమల్లో మూడుముక్కలాట ఆడుతోంది.