మెగా కాంపౌండ్ లో `బావ- బామ్మర్ధి`ని ఆడేస్తోంది!

0

జాక్ పాట్ అంటే ఇదే మరి! కన్నడ బ్యూటీ రష్మిక మందన రచ్చ మెగా కాంపౌండ్ కి షిఫ్టవుతోంది. అక్కడ ఏకంగా బావ బామ్మర్థిని ఆడేసేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ ఎవరా బావ.. ఎవరా బామ్మర్థి అంటే.. రామ్ చరణ్ .. బన్ని గురించే. ఒకేసారి లక్కీగా ఆ ఇద్దరి సరసన ఛాన్స్ పట్టేసిన రష్మిక ప్రస్తుతం ఫోటోషూట్లలో పాల్గొంటోందనేది ఆసక్తి రేకెత్తిస్తున్న పాయింట్. మెగా బావ బావమరుదులతో ఒకేసారి జాక్ పాట్ కొట్టేసింది మరి.

ఛలో- గీత గోవిందం- సరిలేరు నీకెవ్వరు- భీష్మ .. ఇలా నటించిన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లు. దీంతో లక్కీ గాళ్ రష్మిక ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ప్రస్తుతం బన్ని సరసన `పుష్ప`లో అలాగే చరణ్ సరసన `ఆచార్య`లో ఈ భామ నటించనుంది. నవంబర్ నుండి పుష్ప ప్రారంభమవుతోంది. ఈ మూవీకి సంబంధించి రష్మిక మందన లుక్ టెస్ట్ ఇటీవల పూర్తి చేశారు. తన లుక్ ఫైనలైంది.

`ఆచార్య`లో చరణ్ సరసన ఎలా కనిపించనుంది? అన్నది లుక్ టెస్ట్ చేయనున్నారట. ఈ లుక్ టెస్ట్ వచ్చే వారం జరుగుతుంది. రామ్ చరణ్ తో పాటు అక్టోబర్ లో షూటింగ్ పార్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి రష్మిక పూర్తిగా ప్రిపేరవుతోందట. ఇటు చరణ్ అటు బన్నిలతో ఈ రెండు నెలలు పూర్తి బిజీ అయిపోతుంది రష్మిక. అక్టోబర్ – నవంబర్ సీజన్ ఈ అమ్మడికి పూర్తిగా లాకింగ్ పీరియడ్ అనడంలో ఎలాంటి సందేహమే లేదు. అది కూడా బావ-బామ్మర్థితో కలిసి ఒకేసారి షూటింగుల్లో పాల్గొంటుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నిజానికి ఇలాంటి అరుదైన పరిస్థితి అప్పట్లో కాజల్ కి వచ్చింది. ఓవైపు ఆర్య షూటింగులో పాల్గొంటూనే చరణ్ తోనూ కాజల్ షూటింగ్ చేసింది. ఇరు టీమ్ లను కలిసేందుకు అటూ ఇటూ ఆదరాబాదరాగా పరిగెత్తేది. ఆసక్తికరంగా రష్మిక ఈ రెండు సినిమాల్లోనూ డీగ్లామరస్ రోల్స్ లోనే కనిపించనుందని తెలుస్తోంది.