అక్కినేని సమంత డెబ్యూ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి…!

0

‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంతటి ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన ఈ సక్సెస్ ఫుల్ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 ని రూపొందిస్తున్నారు. ఇక సిరీస్ ద్వారా స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత వెబ్ వరల్డ్ లో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు – కృష్ణ డీకే తెరకెక్కిస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ మంచి ఆదరణని దక్కించుకోవడంతో సీజన్ 2 పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి రెట్టింపైంది. ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన సమంత.. ఇటీవల డబ్బింగ్ కూడా చెప్పేశారు.

కాగా కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ మిగిలిన షూటింగ్ కూడా తాజాగా పూర్తైనట్లు దర్శకులు రాజ్ – డీకే ఇంస్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంత నెగెటివ్ రోల్ లో పాకిస్తానీ టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవల ”ది ఫ్యామిలీ మ్యాన్’ ఏడాది సెలబ్రేషన్స్ సందర్భంగా విడుదల చేసిన వీడియోతో సామ్ పాత్రపై క్లారిటీ వచ్చింది. ఈ సిరీస్ తో సామ్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మనోజ్ బాయ్ పాయ్ – ప్రియమణి – సందీప్ కిషన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.