సూపర్ స్టార్ కృష్ణకు పాడనన్న బాలు

0

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతితో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు పలువురు శోక సంద్రంలో మునిగారు. వేల పాటలు పాడి కేవలం తెలుగు తమిళ హిందీ భాషల ప్రేక్షకులు అని కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. అంతటి గాన గంధర్వుడు మృతి చెందడటంతో సోషల్ మీడియాలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. ఈ సమయంలో బాలు గారు కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో కృష్ణ గారితో తనకు ఉన్న విభేదాల గురించి మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతోంది.

బాలు ఆ ఇంటర్వ్యూలో… ఒకసారి కృష్ణ గారితో ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో వివాదం మొదలైంది. ఆ సమయంలో ఇద్దరం కాస్త గట్టిగానే మాట్లాడుకున్నాం. అప్పటి నుండి దాదాపు రెండేళ్ల పాటు కృష్ణ గారికి నేను పాడలేదు. ఆ సమయంలో చాలా మంది మమ్ములను కలిపేందుకు నాతో కృష్ణ గారి సినిమాలకు పాడించేందుకు ప్రయత్నించారు. కాని నేను ఒప్పుకోలేదు. ఒకసారి వేటూరి సుందర్రామూర్తి గారు ఎందుకు కృష్ణకు పాడవయ్యా అంటూ ప్రశ్నించారు. అప్పుడే నేను మీరు ఎందుకు అన్నయ్య విశ్వనాద్ గారికి పాటలు రాయడం లేదు అంటూ ప్రశ్నించాను. అందుకు ఆయన సమాధానం దాటవేశారు.

కొన్నిరోజుల తర్వాత నాకు వేటూరి గారి నుండి కాల్ వచ్చింది. నేను ఆయనతో మాట్లాడాను.. నీతో మాట్లాడుతున్నాను అన్నారు. అప్పుడు నేను కూడా వెళ్లి కలుసుకుంటాను అంటూ ఆయనతో చెప్పాను. దాదాపు రెండేళ్ల తర్వాత పద్మాలయ స్టూడియోకు వెళ్లాను. అక్కడున్న వాళ్లు అంతా కూడా ఆశ్చర్యపోయారు. నేరుగా కృష్ణగారి రూమ్ కు వెళ్లి ఆరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అంటూ చెప్పబోయాను. అవేమి ఇప్పుడు వద్దండి. ఈరోజు నుండి మళ్లీ కలిసి మంచిగా పని చేసుకుందాం అన్నారు. ఒక్క మాటతో మా మద్య ఉన్న రెండేళ్ల గొడవకు తెర పడిందంటూ బాలు గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.