దీపికా పదుకొనే ఇంటికి భద్రత పెంపు…!

0

బాలీవుడ్ డ్రగ్ సంబంధాలపై బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే కి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో గోవాలో షూటింగ్ లో ఉన్న దీపికా తన భర్త రణవీర్ సింగ్ తో కలిసి గురువారమే ముంబై చేరుకున్నారు. ఎన్సీబీ నోటీసుల ప్రకారం దీపికా రేపు (సెప్టెంబర్ 26) విచారణకు హాజరు కానుంది. ఈ నేపథ్యంలో దీపికా నివాసానికి వెలుపల భద్రత పెంచినట్లు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభాదేవిలోని దీపిక నివాసం వెలుపల పోలీసు బృందాలు మోహరించాయని సమాచారం. బాలీవుడ్ డ్రగ్స్ నెక్సస్ పై దర్యాప్తు చేస్తున్న ఎన్సిబి దీపికా తోపాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను కూడా విచారణకు పిలిపించింది.

కాగా 2017లో దీపికా ఆమె మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు క్వాన్ టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ బయటపడటంతో ఎన్సీబీ ఆమెకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చాట్ లో ‘D’ మరియు ‘K’ మధ్య వాట్సాప్ చాటింగ్ ద్వారా ‘మాల్’ ‘హ్యాష్’ గురించి డిస్కస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా క్వాన్ ఆద్వర్యంలోని ఆ వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ కూడా దీపికా నే అని నేషనల్ మీడియా ఛానల్స్ చెప్తున్నాయి. ఈ క్రమంలో నేడు కరిష్మా ప్రకాష్ ఎన్సీబీ ఎదుట హాజరైంది. ఆమెతో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కూడా ఎన్సీబీ విచారించింది. ఈ క్రమంలో సమన్లు అందుకున్న దీపికా పదుకునే – శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ లు రేపు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణను ఎదుర్కోనున్నారు. ఇప్పుడు దీపికా ఇంటికి భద్రత పెంచినట్లే రేపు ముగ్గురు హీరోయిన్లు విచారణకు హాజరవుతుండగా ఎన్సీబీ ఆఫీస్ కు కూడా అదనపు భద్రత కల్పించనున్నారని తెలుస్తోంది.