Templates by BIGtheme NET
Home >> Cinema News >> మేనేజర్లు నిర్మించే సినిమాకి ఫైనాన్స్ చేస్తున్న రష్మిక – సమంత..?

మేనేజర్లు నిర్మించే సినిమాకి ఫైనాన్స్ చేస్తున్న రష్మిక – సమంత..?


సుధీర్ బాబు – ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా రానున్న ఈ చిత్రాన్ని బి.మహేంద్రబాబు – కిరణ్ బాలపల్లి నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా నిర్మాతలు ఇద్దరు స్టార్ హీరోయిన్లయిన అక్కినేని సమంత – రష్మిక మందన్నా ల మేనేజర్స్ అని తుపాకీ ఇంతకముందే వెల్లడించింది. అయితే ఇప్పుడు సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో సమంత – రష్మిక బ్యాక్ ఎండ్ లో పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది.

సుధీర్ బాబు కూడా ఈ సినిమా ప్రొడక్షన్ లో భాగం పంచుకుంటుండగా.. ఇప్పుడు తమ మేనేజర్లు నిర్మాతలుగా వ్యవహరించే చిత్రానికి సమంత – రష్మిక ఫైనాన్స్ చేయడానికి ముందుకొచ్చారట. అందుకే ఈ చిత్రాన్ని రష్మిక – సమంత కలసి ప్రమోట్ చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందించనుండగా.. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. సుధీర్ బాబు – ఇంద్రగంటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.