Templates by BIGtheme NET
Home >> Cinema News >> డిజిటల్ రిలీజ్ కి సిద్ధమే.. కానీ వన్ కండిషన్…!

డిజిటల్ రిలీజ్ కి సిద్ధమే.. కానీ వన్ కండిషన్…!


కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అవ్వక చాలా రోజులు అయింది. కొత్త సినిమాలతో థియేటర్స్ మొత్తం సందడిగా ఉండే సమ్మర్ సీజన్.. ఈసారి బొమ్మ పడకుండానే గడిచిపోయింది. ఇక పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు ప్రొడ్యూసర్స్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. సినిమా కోసం తెచ్చిన డబ్బులపై వడ్డీలు పెరుగుతుండటం.. రోజులు గడిచే కొద్దీ ఆ కంటెంట్ ఓల్డ్ అయిపోతుందేమో అనే ఆలోచనతో తమ సినిమాలు ఓటీటీలలో రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. కానీ టాలీవుడ్ లో క్రేజీ మూవీస్ ఏవీ ఓటీటీలలో రిలీజ్ అవలేదు. అయితే ఓటీటీలు ఒక కండిషన్ కి ఒప్పుకుంటే తమ సినిమాలు డిజిటల్ రిలీజ్ చేయడానికి రెడీ అంటున్నారట.

కాగా ఒకప్పుడు సినిమా థియేటర్ లో విడుదలైన నెల రోజుల తర్వాత ఆ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెట్టేవారు. దీంతో అటు ప్రొడ్యూసర్స్ ఇటు ఓటీటీలు లాభపడేవి. అయితే ఇప్పుడు థియేటర్స్ క్లోజ్ అయి ఉండటంతో డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వస్తోంది. అందువల్ల నిర్మాతలు థియేటర్ రెవెన్యూని కోల్పోతున్నారు. అందువల్ల ఇప్పుడు మేకర్స్ ఓటీటీలకు ఓ కండిషన్ పెడుతున్నారట. తమ సినిమాలని డిజిటల్ రిలీజ్ చేస్తాం.. కానీ థియేటర్స్ ఓపెన్ చేశాక మళ్ళీ థియేటర్ రిలీజ్ కి వెళ్తామని అంటున్నారట. ఎందుకంటే ఓటీటీలు ప్రస్తుతం సిటీస్ వరకే పరిమితం అయ్యాయి. థియేటర్స్ లో మాత్రమే సినిమాలు చూసే రూరల్ ఏరియాస్ వరకు ఇంకా రీచ్ కాలేదు. ఈ క్రమంలో థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక ప్రేక్షకులు మళ్ళీ తమ సినిమాని చూడటానికి వస్తారని భావిస్తున్నారట. అందుకే ఇప్పుడు కొన్ని పెద్ద సినిమాలను ఓటీటీ రిలీజ్ కి రెడీ చేస్తున్నారట.

ఇదిలా ఉండగా తెలుగులో చాలా సినిమాలు చిత్రీకరణ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నాని – సుధీర్ బాబు ‘వి’.. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’.. రామ్ పోతినేని ‘రెడ్’.. అనుష్క ‘నిశ్శబ్దం’.. యాంకర్ ప్రదీప్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాలు ఉన్నాయి. అయితే ‘వి’ సినిమాని సెప్టెంబర్ మొదటి వారంలో ఓ ప్రముఖ ఓటీటీలో విడుదల చేయబోతున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ఆవస్తున్నాయి. దీంతో పాటు ‘నిశ్శబ్దం’ సినిమాని కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు థియేటర్స్ రీ ఓపెన్ చేశాక థియేటర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.