Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రభాకర్ నిజస్వరూపం ఇదీ! కరోనాతో చచ్చిపోతుంటే పై నుంచి వచ్చి కిందనుంచి పోతుందన్నాడు: నటి శివ పార్వతి షాకింగ్ వీడియో

ప్రభాకర్ నిజస్వరూపం ఇదీ! కరోనాతో చచ్చిపోతుంటే పై నుంచి వచ్చి కిందనుంచి పోతుందన్నాడు: నటి శివ పార్వతి షాకింగ్ వీడియో


ఎస్పీబాలు, అమితాబ్, అభిషేక్, స్మిత, సింగర్ సునీత ఇలా ఇండస్ట్రీ ప్రముఖుల్లో చాలా మందికి కరోనా వచ్చింది. అయితే వీళ్లు కోలుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు వీడియోలు, ఫొటోలు, మెసేజ్ విపరీతంగా షేర్ చేశారు. ఇక ప్రభుత్వాలు అయితే వీళ్ల ట్రీట్ మెంట్‌కి తామే ఖర్చులు భరిస్తాం అని ఈ పే….ద కళాకారుల పట్ల భక్తి చూపించారు. తప్పని చెప్పడం లేదు కాని.. వీరికి మాదిరి కాకుండా నిజంగానే దిగువ శ్రేణి నటీనటులు కరోనా బారిన పడుతున్నారు. కనీసం వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నానని తన ధీన స్థితిని తెలియజేసింది సీనియర్ నటి శివ పార్వతి.

పలు సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించి మెప్పించిన సీనియర్ నటి శివ పార్వతి‌ కరోనా బారిన పడ్డారు. వదినమ్మ సీరియల్‌తో పాపులర్ అయిన శివపార్వతి తనకు కరోనా సోకిన విషయాన్ని తెలియజేస్తూ ఆసుపత్రి నుంచి ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు.

టీవీ యాక్టర్ ప్రభాకర్ గారు.. నటిస్తూ నిర్మిస్తున్న వదినమ్మ సీరియల్ యూనిట్‌కి అందరికీ నమస్కారం.. నాకు కరోనా పాజిటివ్ వచ్చి చాలా సీరియస్ అయ్యింది. మళ్లీ ఇంటికి వస్తానా లేదా అన్న పరిస్థితుల్లోకి వెళ్లిపోయి తిరిగి కోలుకున్నాను. పదిరోజుల పాటు హాస్పటల్‌లోనే ఉన్నాను.. రెండు హాస్పటల్స్ మారాను. ఈ విషయం ప్రభాకర్‌కి కూడా తెలుసు. మా సీరియల్ యూనిట్‌కి కూడా తెలుసు.

అయితే ఈ విషయంలో నేను ఎవర్నీ ఏం అనదల్చుకోలేదు.. కేవలం థాంక్స్ మాత్రమే చెప్తున్నా.. ఎందుకంటే నాకు కరోనా వచ్చింది కాబట్టి చాలామంది ఒరిజినల్ క్యారెక్టర్స్ తెలుసుకోగలిగాను. ఎవరేంటి అన్నది తెలిసింది. ఎంతపెద్ద ఆర్టిస్ట్‌కి అయినా.. చిన్న ఆర్టిస్ట్‌కి అయినా ప్రాణం అనేది ఒక్కటే.. నేను వదినమ్మ యూనిట్‌లో ఓ ఆర్టిస్ట్.. అందరితో పాటు కలిసి పనిచేశా.. ఒకవేళ ఆ సీరియల్‌లో పనిచేసినా చేయకపోయినా.. ఆర్టిస్ట్‌ల మధ్య అనుబంధం ఉంటుంది. కాని నేను ఎక్కడ ఉన్నాను.. ఏ హాస్పటల్‌లో ఉన్నాను.. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను అని అడగడం కూడా చేయలేదు.. ఇది చాలా దురదృష్టం.

ఎవరికి ఎవరూ తోడు ఉండరని అర్థమైంది. నేను ప్రభాకర్ గురించి ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయను. ఎందుకంటే అది అంతే. మేం కూడా అలాగే ఉండాలని అర్థమైంది. సీరియల్‌లో నటించామా వచ్చేశామా అనే ఉండాలి.. ఆ మనుషుల్ని మరిచిపోవాలి. నేను ఐదేళ్ల నుంచి సినిమాలు చేయకపోయినా.. జీవితా రాజశేఖర్ గారు నా పరిస్థితి తెలుసుకుని డాక్టర్స్‌తో మాట్లాడి నాకు సాయం చేశారు. నేను ప్రాణంతో బయటపడ్డాను అంటే వాళ్ల వల్లే.

ప్రభాకర్ గారూ ఈ వైరస్ నోట్లో నుంచి వెళ్లి కింద నుంచి వచ్చేస్తుందని చెప్పారు.. రెండు లక్షలు సరిపోదు.. పది లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోండి అన్నారు. అది నేను చేసుకోలేకపోయాను. కాని ప్రొడక్షన్స్ నుంచి ఇన్సూరెన్స్ చేశాం అని చెప్పారు. కాని క్లైమ్ చేసుకోమని చెప్పడం కూడా చేయలేరా? మీ అందరికీ నేను థాంక్స్ చెప్తున్నా. నేను పోయానని తెలిసినా ఇంతే రెస్పాన్స్ అవుతారు. ఎవరికీ తెలియనివ్వకుండా కామ్‌గా షూటింగ్ కానిచ్చేస్తారు. ఈ సీరియల్ ప్రొడ్యుసర్ శివకుమార్.. నాకు వందరూపాయిల శాలువా కప్పి అప్పట్లో సన్మానం చేశారు.. అభిమానం చూపించారు.. కాని ఇప్పుడు మనిషి చచ్చిపోతుంటే.. ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం అనేది తప్పు. న్యాయం కాదు.. ఆర్టిస్ట్‌ల పట్ల ప్రేమ పంచడం అనేది ఉంటే చచ్చిపోయే వాడికి కూడా బలం వస్తుంది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు శివ పార్వతి.