‘లవ్ ఆజ్ కల్’తో వారి లవ్ కు ఫుల్ స్టాప్

0

Sara Ali Khan And Kartik Aryaan Breakup to their love

Sara Ali Khan And Kartik Aryaan Breakup to their love

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ఈమద్యే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. హీరోయిన్ గా స్టార్ డం దక్కించుకోకుండానే యంగ్ హీరో ఆర్యన్ కార్తీక్ తో ప్రేమలో పడ్డట్లుగా వార్తలు వచ్చాయి. వారిద్దరు బాహాటంగానే కనిపించడంతో పాటు ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండటంతో ఇద్దరి మద్య ప్రేమ విషయం వారు చెప్పకున్నా నిజమే అని నిర్థారణ అయ్యింది. ఇద్దరి గురించి బాలీవుడ్ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. అయితే వీరిద్దరు కొన్నాళ్లకే ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టారు.

లవ్ ఆజ్ కల్ చిత్రంలో ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సినిమా ప్రమోషన్ సమయంలో కూడా చాలా క్లోజ్ గానే అనిపించారు. కాని ఎప్పుడైతే సినిమా ప్రమోషన్స్ పూర్తి అయ్యాయో అప్పటి నుండి మళ్లీ కలిసి కనిపించలేదు. ఆ తర్వాత వీరిద్దరు ఇన్ స్టా అకౌంట్స్ ను చూసినట్లయితే ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం మానేశారు. ఇద్దరు కూడా అన్ ఫాలో అవ్వడంతో గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న ప్రచారంకు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.

లవ్ ఆజ్ కల్ చిత్రం సమయంలో ఏం జరిగిందో ఏమో అంటూ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ విషయంలో సమస్య తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో అన్ని రోజులు కలిసి ఉండి ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు వీరు కలవలేదు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో అయ్యారు. దాంతో వీరిద్దరి బ్రేకప్ గురించి క్లారిటీ వచ్చేసింది. ఇద్దరు కూడా కెరీర్ విషయంలో దృష్టి పెట్టాలనే ఉద్దేశ్యంతో బ్రేకప్ అయ్యి ఉంటారని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు కూడా వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. కనుక కెరీర్ కోసం వారు బ్రేకప్ అయ్యి ఉండవచ్చు అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.