‘ఆద్య’గా రాబోతున్న రేణు దేశాయ్

0

హీరోయిన్ గా కేవలం రెండు సినిమాల్లోనే కనిపించినా కూడా రేణు దేశాయ్ కి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆమె మళ్లీ నటించాలంటూ అభిమానులు మరియు ప్రేక్షకులు చాలా రోజులుగా కోరుకుంటున్నారు. ఆమెకు సినిమా మేకింగ్ పై ఆసక్తి ఉందని గతంలోనే పేర్కొంది. అయితే ఆమె రీ ఎంట్రీకి కాస్త ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇటీవలే రేణు దేశాయ్ నుండి క్లారిటీ వచ్చింది. కృష్ణ మామిడాల దర్శకత్వంలో రూపొందబోతున్న ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో ఈమె పాల్గొనబోతుంది.

ఒక మహిళ సత్యాన్వేషణ క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటీ.. ఆమెకు సంబంధించిన ఇబ్బందులను ఎలా అధిగమించింది అనేది ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారట. ఆ మహిళ పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుంది. తన స్వభావంకు దగ్గరగా ఉండే పాత్రలో రేణు నటించబోతున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు ‘ఆద్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారట. పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ ల కూతురు పేరు ఆద్య అనే విషయం తెల్సిందే. ఆ పేరుతో ఇప్పుడు రేణు దేశాయ్ నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతుండటం కాకతాళీయమే అయినా ఇప్పుడు ఆ విషయమై సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. వెబ్ సిరీస్ తో సక్సెస్ అయితే వెండి తెరపై కూడా రేణు దేశాయ్ నటించనుంది.