మహేష్ కు ’14 లక్షలు’ రికార్డ్

0

సౌత్ ఇండియాలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ముందు వరుసలో ఉండే హీరో మహేష్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఫేస్ బుక్.. ఇన్ స్టా.. ట్విట్టర్ ఎక్కడైనా ఆయన పోస్ట్ పెడితే భారీగా లైక్స్ వస్తుంది. ఆయన పోస్ట్ కు వచ్చే రెస్పాన్స్ ఎప్పుడైనా భారీగా ఉంటుంది. ట్విట్టర్ లో అత్యధిక పోస్ట్ లకు లక్షకు పైగా లైక్స్ ను మహేష్ బాబు దక్కించుకున్నాడు. సౌత్ లో మరో హీరో కూడా ఇంత భారీగా లైక్స్ ను దక్కించుకోలేదు. ఇప్పటి వరకు ఆయన ట్వీట్ చేసిన ట్వీట్స్ లో 14 ట్వీట్స్ కు లక్ష ఆపై లైక్స్ వచ్చాయి.

14 ట్వీట్స్ కు లక్షకు పైగా లైక్స్ మరే హీరోకు రాలేదు. ఇంకా చాలా ట్వీట్స్ కు లక్షకు చేరువలో లైక్స్ ఉన్నాయి. మహేష్ బాబు స్టామినాను స్టార్ డంకు ఈ లైక్స్ సాక్ష్యం అంటూ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. సోషల్ మీడియాలో సౌత్ హీరోల్లో మహేష్ బాబు తర్వాతే మరెవ్వరైనా అంటూ అభిమానులు అంటున్నారు. ఇక మహేష్ బాబు త్వరలో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. ఆ సినిమాకు గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.