సుశాంత్ సిస్టర్స్ పెట్టిన కేసుని విత్ డ్రా చేసుకోమంటోంది!

0

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసుని CBIకి అప్పగించాలంటూ దేశ వ్యాప్తంగా డిమాండ్ మొదలు కావడంతో కేంద్ర సుశాంత్ కేసుని సీబీఐకి అప్పగించింది. అక్కడి నేఉంచి అనేక మలుపులు తిరిగిన ఈ కేసు తాజాగా నీరు గారిపోయింది. సుశాంత్ ది హత్య కాదని… ఆత్మ హత్యేనని ఏయిమ్స్ విభాగం కూడా తేల్చడంతో సుశాంత్ కేసు పక్కదారి పట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా వుంటే సుశాంత్ ఇద్దరు సోదరీమణులు తమ సోదరుడి కోసం నకిలీ మెడికల్ ప్రిస్క్రిప్షన్ను ఫోర్జరీ చేసి కొనుగోలు చేసినందుకు తమపై నమోదైన కేసును రద్దు చేయాలని ఆ పిటిషన్ ను కొట్టివేయాలని నటి రియా చక్రవర్తి బొంబాయి హైకోర్టును కోరారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ కేసులో రియా చక్రవర్తి కూడా నిందితురాలుగా అభియోగాలు ఎదుర్కొంటోంది. ఈ కేసులో మాదకద్రవ్యాల సంబంధిత ఆరోపణలపై అరెస్టు చేసిన 28 రోజుల తరువాత బొంబాయి హైకోర్టు బెయిల్ మంజూరు కావడంతో ఆమెను ఈ నెల ప్రారంభంలో విడుదల చేశారు.

సుశాంత్ రాజ్పుత్ సోదరీమణులు ప్రియాంక సింగ్… మీతూ సింగ్ లు తనపై పెట్టిన కేసుని కొట్టి వేయాలని.. అవి నిరాధారమైన ఆరోపణలని రియా ముంబై హై కోర్టుకు తెలిపింది. సుశాంత్ రాజ్పుత్ సోదరీమణులపై కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున దర్యాప్తు సంస్థకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని రియా చక్రవర్తి అన్నారు. తన న్యాయవాది సతీష్ మనేషిందే ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డిపిఎస్) చట్టం ప్రకారం నిషేధించబడిన మందులను సుశాంత్ రాజ్పుత్ సేకరించడానికి సహాయం చేయడానికి నకిలీ మరియు కల్పిత వైద్య ప్రిస్క్రిప్షన్ ఉపయోగించబడింది.

అది పొందిన ఐదు రోజులకే సుశాంత్ మరణించాడు. అందులో అతను తన సోదరి ప్రియాంక… డాక్టర్ తరుణ్ కుమార్ ఆదేశాల మేరకు చట్టవిరుద్ధంగా సైకోట్రోపిక్ మెడిసిన్ ని వాడినట్టు నిర్ధారణ అయింది` అని రియా చక్రవర్తి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే వారు సూచించిన మెడిసిన్ లు సుశాంత్ రాజ్ పుత్ తీసుకున్నారా. అది అతని మరణానికి దోహదం చేసి ఉండవచ్చు లేదా అతని మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజార్చిందా అని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని రియా తన అఫిడవిట్ లో పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.