ఈ వీకెండ్ కు బిబి హోస్ట్ ఎవరు?

0

నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలీ వెళ్లాడు. అక్కడ 21 రోజుల పాటు ఉండబోతున్నట్లుగా ఒక వీడియో విడుదల చేసి మరీ నాగ్ చెప్పాడు. మొన్నటి వీకెండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ లో నాగార్జున కనిపించలేదు. మనాలీలో ఉన్న కారణంగా ఇంటి బాధ్యతలను కొడలు పిల్ల సమంతకు అప్పగిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. మొత్తానికి దసరా సందర్బంగా బిగ్ బాస్ హౌస్ ను సమంత డీల్ చేసింది.

శనివారం హోస్ట్ లేకుండానే సాగిన షో ఆదివారం మాత్రం సమంత హోస్టింగ్ తో ఏకంగా మూడు గంటల పాటు మారథాన్ ఎపిసోడ్ సాగింది. నాగార్జున మరో రెండు వారాలు కూడా మనాలీలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు కనుక ఈ వారం మరియు వచ్చే వారం కూడా బిగ్ బాస్ కు గెస్ట్ హోస్ట్ తప్పదని అంతా భావిస్తున్నారు. కాని మీడియా సర్కిల్స్ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ శుక్రవారం నాగార్జున మనాలీ నుండి హైదరాబాద్ రాబోతున్నాడు.

గత వారంలోనే హైదరాబాద్ కు నాగార్జున రావాల్సి ఉన్నా కూడా వాతావరణం అనుకూలించక పోవడంతో రాలేక పోయాడు. అందుకే సమంతను ఆయన స్థానంలో రంగంలోకి దించారు. ఇప్పుడు నాగార్జున రాబోతున్నాడు. మనాలీ నుండి హైదరాబాద్ కు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. కనుక ఆయన్ను ఈ వారం హోస్ట్ గా మనం చూడబోతున్నాం. గత వారం కూడా నాగార్జున వచ్చే వాడు కాని దసరాకు సమంతతో ప్రత్యేక ఎపిసోడ్ ను ప్లాన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన రాలేదు అంటూ టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఈ వీకెండ్ మళ్లీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను నాగార్జున ఆట ఆడించబోతున్నాడు.