రియా ఫోన్ కాల్ లిస్ట్… ఎన్నో అనుమానాలు

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పూత్ మృతి కేసు అటు తిరిగి ఇటు తిరిగి రియా వద్దకు వస్తుంది. ఆయన చనిపోవడానికి ముందు వరకు కూడా ఆమెతో ప్రేమలో ఉన్నాడని చాలా మంది చెబుతున్నారు. ఆమె కూడా తాను సుశాంత్ ను ప్రేమించాను అంటూ చెప్పింది. మొదట అత్మహత్యగా చాలా మంది భావించినా ఇప్పుడు మాత్రం రియా కారణం అంటూ చాలా గట్టిగా నమ్ముతున్నాం అంటున్నారు. ఆయన మృతికి రియా కారణం అంటూ కేకే సింగ్ కూడా ఫిర్యాదు చేయడంతో ఆమె మరింతగా ఇరుక్కు పోయింది.

ఈ కేసును మొదట మహారాష్ట్ర పోలీసులు ఆ తర్వాత బీహార్ పోలీసులు ఎంక్వౌరీ చేశారు. ఇప్పుడు సీబీఐ మరియు ఈడీ కూడా ఎంక్వౌరీ మొదలు పెట్టింది. మరో వైపు మీడియా కూడా సాధ్యం అయినంతగా సమాచారం సేకరించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఒకటి రియా కాల్ లిస్ట్ ను సంపాదించింది. అందులో పలువురికి ఆమె కాల్స్ చేసినట్లుగా ఉంది. ఆ మీడియా సంస్థ చెబుతున్న విషయాల్లో నిజం ఎంత ఉందో క్లారిటీ లేదు కాని రియా కాల్ లిస్ట్ పలు అనుమానాలు లేవనెత్తుతోంది.

సుశాంత్ చనిపోయిన రోజు నుండి బాలీవుడ్ కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కు రియా చాలా సార్లు ఫోన్ చేసిందట. ఆయన నుండి కూడా రియాకు ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ నుండి కొందరు మీడియా ప్రతినిధులకు మరియు మరికొందరు పీఆర్ లకు కూడా కాల్స్ వెళ్లాయట. తన గురించి మీడియాలో పాజిటివ్ గా వార్తలు రాయాలని ఆమె కోరిందట.

సుశాంత్ చనిపోయిన తర్వాత ఎందుకు ఆమె పాజిటివ్ వార్తలు కోరింది అనేది కొందరి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రియా మొబైల్ నుండి టాలీవుడ్ కు చెందిన ఇద్దరు స్టార్స్ కు కూడా వార్తలు వచ్చాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి రియా చక్రవర్తి రోజు రోజుకు ఇరుక్కుంటుంది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.