Templates by BIGtheme NET
Home >> Cinema News >> సూటిగా బౌన్స‌ర్ వేసి వ‌ల‌పు వ‌ల‌లోకి లాగుతోంది

సూటిగా బౌన్స‌ర్ వేసి వ‌ల‌పు వ‌ల‌లోకి లాగుతోంది


చాలా మంది క‌థానాయిక‌లు ప్రతిష్టాత్మక కుటుంబాల నుంచి బాలీవుడ్ కి వ‌చ్చిన‌వారే. సంపద సృష్టించిన కుటుంబాల నుంచి మంచి స‌త్సంబంధాలతో చాలా సులువుగా కెరీర్ ని ప్రారంభిస్తారు. కానీ అందరూ శాశ్వతమైన విజయాన్ని సాధించలేరు. కొంద‌రు మాత్ర‌మే అగ్ర క‌థానాయిక‌లుగా ఎదుగుతారు. చాలామంది ఐపు లేకుండా పోయిన వారు ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ కుటుంబానికి చెందిన రియా సేన్ కుటుంబ నేప‌థ్యం ఎంతో గొప్ప‌ది. ప‌రిశ్ర‌మ మూలాలు ఉన్న కుటుంబం అది. పాపుల‌ర్ క్లాసిక్ డే నటి సుచిత్రా సేన్ రియాకు అమ్మమ్మ కాగా, మేటి వెట‌ర‌న్ క‌థానాయిక‌ మూన్ మూన్ సేన్ రియాకు తల్లి. అయితే రియా అమ్మ‌మ్మ, అమ్మ బాట‌లో న‌టి అయినా కానీ, పరిశ్రమలో శాశ్వతమైన ముద్ర వేయడంలో విఫలమైంది.

రియా దేవ్ వర్మ త‌న అస‌లు పేరు. బాలీవుడ్‌లోకి ప్రవేశించిన తర్వాత తన ఇంటిపేరును జోడించి రియా- సేన్‌గా మారింది. గొప్ప‌ వంశం గొప్ప‌ సంబంధాలు క‌లిగి ఉన్నప్పటికీ రియా సేన్ కెరీర్ ఆశించిన విధంగా ఎద‌గ‌లేదు. క‌రీనా క‌పూర్ ఖాన్, సోహా అలీ ఖాన్ – అదితి రావ్ హైదరీ వంటి సినీనేప‌థ్య‌ తారల విజయవంతమైన ప్రయాణాల మాదిరిగా కాకుండా, రియా సేన్ తనను తాను న‌టిగా సుస్థిరం చేసుకోవ‌డంలో సవాళ్లను ఎదుర్కొంది.

రియా సేన్ తండ్రి వంశం త్రిపుర రాజకుటుంబానికి చెందినది. 5 సంవత్సరాల వయస్సులో రియా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 1991లో ‘విష‌క‌న్య‌’ చిత్రంలో పూజా బేడీకి చిన్ననాటి వెర్షన్ లో న‌టించింది. మణిరత్నం రచించగా, భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘తాజ్ మహల్‌’తో రియా 19వ ఏట టీనేజ్ క‌థానాయిక‌గా అధికారిక ప్రవేశం చేసింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూసింది.

బాలీవుడ్ లోను రియా సేన్ కెరీర్ అంతంత మాత్ర‌మే. 2001లో షర్మాన్ జోషి, సాహిల్ ఖాన్, శిల్పి శర్మల సరసన స్టైల్ చిత్రంలో న‌టించింది. దీనికి ఎన్ చంద్ర దర్శకత్వం వ‌హించారు. రెండో సినిమాతో విజ‌యం అందుకున్నా కానీ, ఆ త‌ర్వాత పెద్ద స్టార్ కాలేక‌పోయింది. ఝంకార్ బీట్స్, ఖయామత్, అప్నా సప్నా మనీ మనీతో చిత్రాలు ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే సాధించాయి. కెరీర్ లో ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అని చెప్పుకోవ‌డానికి లేదు. కొన్ని వరుస సినిమాల తర్వాత రియా సేన్ పరిశ్రమ నుండి కొంత విరామం తీసుకుంది. 2017లో అప్పటి ప్రియుడు అయిన శివమ్ తివారీని వివాహం చేసుకుని జీవితంలో కొత్త దశలోకి ప్రవేశించింది.

ఏది ఏమైనా కానీ రియా సేన్ కెరీర్ బాలీవుడ్ లో ఆల్మోస్ట్ ముగిసింది. అదే స‌మ‌యంలో రియా ఇత‌ర వ్యాపారాల వైపు మొగ్గు చూపుతోందని మీడియాలో క‌థ‌నాలొచ్చాయి. ఇత‌ర వ్యాప‌కాలు ఎన్ని ఉన్నా కానీ, సోష‌ల్ మీడియాల్లో నిరంత‌రం త‌న అభిమానుల‌ను చిల్ చేయ‌డం మాత్రం ఆప‌లేదు. తాజాగా ఇన్ స్టా వేదిక‌గా రియాసేన్ షేర్ చేసిన హాట్ బికినీ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. వాలు చూపుల వ‌ల‌లు విసురుతూ కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేసింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జ‌లంలో వైర‌ల్ ఆ మారింది. ఈ ఫోటోకి ‘లివ్ ఏ టాక్సిక్ ఫ్రీ లైఫ్’ అని వ్యాఖ్య‌ను జోడించింది. అన్న‌ట్టు రియా సేన్ చాలా కాలం క్రితం స్పా బిజినెస్ లో ప్ర‌వేశించింద‌ని కూడా క‌థ‌నాలొచ్చాయి. దాని ప్ర‌చారం కోస‌మే ఇలాంటి స్టంట్ వేస్తోందా? అన్న‌ది అభిమానులే క‌నిపెట్టాలి.