Templates by BIGtheme NET
Home >> Cinema News >> కమ్ డౌన్ అంటూ హీటెక్కించిన బ్యూటీ!

కమ్ డౌన్ అంటూ హీటెక్కించిన బ్యూటీ!


శ్రుతిహాసన్-శంతను హజారికా లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మైకెల్ కోర్సలే తో బ్రేకప్ తర్వాత శ్రుతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ హజారికాకు దగ్గరైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యానికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే చాలాసార్లు వైరల్ గా మారాయి. ఇటీవలే శృతి హాసన్ మరోసారి ప్రియుడితో రొమాంటిక్ గా దిగిన కొన్ని ఫోటోల్ని సైతం షేర్ చేసింది.

వాటితో ఇద్దరి మధ్య బాండింగ్ ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేసింది. ఇలా పదే పదే హింట్ ఇవ్వడంతో స్నేహాన్ని మించిన బాండింగ్ బలపడిందని మరోసారి రుజువైంది. తాజాగా ఈ జంట ఒకే గదిలో చిలౌట్ అవుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నేరుగా శ్రుతిహాసన్ ఇన్ స్టారీల్స్ ద్వారా రివీల్ చేసింది.

ఇందులో శ్రుతి హాసన్ హాట్ లుక్ లో దర్శనమించింది. టాప్ లో బ్లాక్ కలర్ పీస్ లో కనిపిస్తుంది. ఆ పక్కనే శంతను డిప్స్ కొడుతున్నాడు. మరోవైపు జిమ్ కోచ్ అదే గదిలో ఉన్నాడు. శ్రుతి హాసన్ మాత్రం కమ్ డౌన్ అంటూ మిద్దెక్కిన పిల్లిని కిందకు పిలవడం గమనించవచ్చు. శ్రుతిహాసన్ ఇన్ స్టా లో యమా యాక్టివ్ గా ఉంటుంది.

ఇటీవల కాలంలో ఆ యాక్టివిటీ మరింత పెరిగింది. కేవలం వ్యక్తిగత వీడియోలు..విషయాలే ఎక్కువగా షేర్ చేస్తుంది. ఏ విషయంపైనైనా పాజిటివ్ గా స్పందించింది. ఇటీవలే అసలైన అందం గురించి ఫిలాసఫర్ టైప్ లో క్లాస్ కూడా పీకింది. జీవితం గురించి కొత్త కొత్త గా మాట్లాడింది. బహుశా అనుభవాలు నేర్పిన గుణఫాఠాలు అయి ఉంటాయి.

ఇక శ్రుతి హాసన్ సినిమాల విషయానికి వస్తే నటిగా బిజీగా ఉంది. పాన్ ఇండియా చిత్రం ‘సలార్’ లో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసింది. దాదాపు తన పాత్ర షూటింగ్ పూర్తయింది. అలాగే నటిసంహ బాలకృష్ణ హీరోగా న టిస్తోన్న 107వ చిత్రంలోనూ ఈభామనే హీరోయిన్.

బాలయ్య సినిమా ఎంట్రీతో మిగతా హీరోలకు శ్రుతిహాసన్ విషయంలో లైన్ క్లియర్ అయింది. బాలయ్య వయసును శ్రుతి హాసన్ మ్యాచ్ చేయగల్గితే చిరంజీవి..నాగార్జున..వెంకటేష్ లాంటలి వారు కూడా రెడీ అంటారు.