సామ్ జామ్ ప్రోమో : నిజంగానే ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదు

0

నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటూ సమంత సామ్ జామ్ టాక్ షో తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఆహా ఓటీటీ కోసం సమంత చేస్తున్న టాక్ షో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మొదటి ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే ప్రకటించిన విధంగా సమంత మొదటి ఎపిసోడ్ విజయ్ దేవరకొండతో ఉంది. టాక్ షో అంటే కేవలం ప్రశ్నలు అడగడం మాత్రమే కాకుండా అంతకు మించి ఈ షో లో ఉండబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది.

టాక్ షో లో ప్రశ్నలు ఫన్నీ టాస్క్ లు.. సీరియస్ చర్చలతో పాటు ఛారిటీ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న వారి కోసం ఈ షో ద్వారా సాయం కూడా అందించనున్నట్లుగా ఈ ప్రోమో చూస్తేనే అర్థం అవుతుంది. టాక్ షో లో ఇలాంటి కాన్సెప్ట్ తీసుకు రావడం అనేది చాలా కొత్తగా ఉంది. మొదటి నుండి అంటున్నట్లుగా సామ్ తో ఎంజాయ్ మెంట్ నిజంగానే మామూలుగా ఉండదు అనిపిస్తుంది. ఇక విజయ్ దేవరకొండ తో సమంత ఏం మాట్లాడి ఉంటుంది.. ఎలాంటి చిక్కు ప్రశ్నలతో అతడిని ఇరుకున పెట్టి ఉంటుంది అనేది ఆసక్తికరంగా ఉంది.

సమంత సామ్ జాబ్ తో సరికొత్త టాక్ షో ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది అనిపిస్తుంది. ఈనెల 13వ తేదీన ఆహాలో స్ట్రీమింగ్ అవ్వబోతున్న సామ్ జామ్ కోసం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినీ వర్గాల వారు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ టాక్ షో నందిని రెడ్డి ఆద్వర్యంలో సాగబోతుంది. ప్రెస్ మీట్ సమయంలో నందిని రెడ్డి ఈ టాక్ షో కోసం చాలా వర్కౌట్ చేసినట్లుగా చెప్పారు. అన్నట్లుగానే కష్టం ప్రోమోలో కనిపిస్తుంది. తప్పకుండా ఈ టాక్ షో మంచి హిట్ అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం.