వెండితెరపై సానియా మీర్జా.. వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్

0

దేశంలోని క్రీడా ప్రముఖులంతా తమ కెరీర్ ముగియగానే రాజకీయాల్లోకి వెళ్లి సెటిల్ అవుతున్నారు. కానీ అనూహ్యంగా మన హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రాజకీయ తెరకు కాకుండా బుల్లితెరకు రానుంది. ఆమె సినీ ఇండస్ట్రీలోకి రావడానికి ఓకే చెప్పింది.

టెన్నిస్ స్టార్ గా దేశానికి ఎన్నో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన సానియా మీర్జా ఆటతోపాటు అందంతో కూడా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. సానియాకు దేశంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు.. టెన్నిస్ ఆటకు బ్రేక్ వేసిన సానియా ఇప్పుడు తనకిష్టమైన వ్యాపకంపై దృష్టి సారించారు.

సోనియా మీర్జా తాజాగా నటనపై ఆసక్తి కనబరుస్తున్నారు. వెబ్ సిరీస్ లో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఎంటీవీ ‘నిషేధ్ ఎలోన్ టుగెదర్ ’ వెబ్ సిరీస్ లో సానియా నటించేందుకు ఓకే చెప్పారు.మొత్తం ఐదు ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ సాగుతుంది. ఈ కార్యక్రమం ఈనెల చివరి వారం నుంచి ఎంటీవీలో ప్రసారం కానుంది.

ఈ సందర్భంగా తాను నటించడానికి గల కారణాలను సానియా వివరించారు. భారత్ లో టీబీపై చైతన్యం తీసుకొచ్చే వెబ్ సిరీస్ ఇది అని.. ట్యూబర్య్కూలోసిస్ పై అవగాహన కల్పించేలా ఈ సిరీస్ తెరకెక్కనుందని తెలిపింది. జనాలకు అవగాహన కలిగించడానికే నటిస్తున్నట్లు సానియా మీర్జా తెలిపారు.