ఎయిర్ పోర్ట్ లో టాలీవుడ్ జంట సింపుల్ అండ్ స్వీట్ క్లిక్

0

రెండు రోజుల క్రితం సమంత కూల్ కాస్ట్యూమ్స్ తో సింపుల్ అండ్ స్వీట్ గా ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమంత సింప్లీ సూపర్ అంటూ కామెంట్స్ వచ్చాయి. సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి ఎయిర్ పోర్ట్ లో కెమెరా కంట పడింది. ఒక్కరు ఉంటేనే వదలని ఫొటో గ్రాఫర్లు ఈసారి సమంత జంట చైతూతో ఉండటంతో మరింత ఆసక్తి చూపించి క్లిక్ మనిపించారు.

ఇద్దరు కూడా చాలా సింపుల్ అండ్ స్వీట్ లుక్ లో ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. ఇద్దరు కూడా మాస్క్ ధరించడంతో పాటు ఎక్కడ ఆగకుండా సోషల్ డిస్టెన్సీ అంటూ అక్కడ నుండి వెళ్లి పోయారు. సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమీ లేకున్నా కూడా ఆమె వెబ్ సిరీస్.. టాక్ షో ఇంకా సొంత వ్యాపారంతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాను పూర్తి చేసి విక్రమ్ కుమార్ థ్యాంక్యూ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలో లవ్ స్టోరీ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.