‘స్కామ్ 1992 – ది హర్షద్ మెహతా స్టోరీ’ టీజర్ విడుదల…!

0

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సిరీస్ ”స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ”. ప్రముఖ రచయితలు దేబషిస్ బసు – సుచేతా దలాల్ సంయుక్తంగా రచించిన ‘ది స్కామ్’ పుస్తకాధారంగా ఈ ఒరిజినల్ సిరీస్ రూపొందించింది. 1992లో భారతదేశ బ్యాంకింగ్ – స్టాక్ ఎక్స్ఛేంజ్ వ్యవస్థలో ఉన్న లొసుగులను బహిర్గతం చేస్తూ సెక్యూరిటీస్ స్కామ్ దేశాన్ని ఒక్క కుదుపు కుదిపేసింది. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తి హర్షద్ మెహతా. ఇప్పుడు ఈ స్టోరీనే హన్సల్ మెహతా తెరకెక్కించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ ఈ సిరీస్ ని నిర్మించింది. దీనికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

కాగా ”స్కామ్ 1992” టీజర్ లో ఇండియాలో 5 వేల కోట్ల రూపాయల బిగ్గెస్ట్ కుంభకోణ సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న హర్షద్ మెహతా గురించి చేసింది. అలాగే అతని నేరాలు న్యూస్ రిపోర్టర్ల దృష్టికి ఎలా వచ్చాయో అనే కోణంలో ఈ సిరీస్ ఉండబోతోందని టీజర్ ద్వారా వెల్లడించారు. మొత్తం మీద బొంబాయి స్టాక్ మార్కెట్ లో హర్షద్ మెహతా పాత్ర.. స్టాక్ బ్రోకర్ స్టాక్ మార్కెట్ ని అంత ఎత్తుకు ఎలా తీసుకువెళ్ళాడు.. ఆ తర్వాత అతని పతనానికి కారణమైన 1992 స్కామ్ లో ఏం జరిగిందనేది.. ఈ ఒరిజినల్ సిరీస్ లో చూపిస్తారని అర్థం అవుతోంది.

ఇక దీంట్లో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాత్రలో గుజరాతి థియేటర్ ఆర్టిస్ట్ ప్రతీక్ గాంధీ కనిపిస్తున్నారు. ‘స్నేహగీతం’ ‘వై చీట్ ఇండియా’ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ‘ది రియూనియన్’ వంటి సినిమాలు మరియు వెబ్ సీరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రేయా ధన్వంతరి ఈ సిరీస్ లో జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో నటించింది. త్వరలో సోనీ లైవ్ లో ప్రసారం కాబోతున్న ఈ సిరీస్ లో సతీష్ కౌశిక్ – అనంత్ మహాదేవన్ – రజత్ కపూర్ – నిఖిల్ ద్వివేది – కె కె రైన – లలిత్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.