కరోనా బారినపడ్డ మరో ఇద్దరు టాలీవుడ్ సింగర్స్.. కంగారులో ఫ్యాన్స్..!

0

కరోనా వైరస్ రోజురోజుకి ఫిల్మ్ ఇండస్ట్రీలో విలయతాండవం చేస్తోంది. ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత సామాజిక దూరం పాటించినా మహమ్మారి బారిన పడేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. గత నెల క్రితమే లాక్ డౌన్ సడలించి రెండు తెలుగు రాష్ట్రాలలో నిబంధనలతో కూడిన అనుమతులు జారీచేసాయి ప్రభుత్వాలు. లాక్డౌన్ సడలింపుల తరువాత ఇండస్ట్రీలో కొన్ని సినిమాల షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. కొందరు మేం జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనే ధీమాతో షూటింగ్స్ ప్రారంభిస్తే.. మరికొందరు కరోనా భయంతో ముందే షూటింగ్స్ నిలిపేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలోని సింగర్స్ పైన కరోనా టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవలే.. సింగర్ స్మిత కరోనా బారిన పడగా.. ఆ తర్వాత లెజెండరి సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకే చెందిన మరో ఇద్దరు సింగర్స్ కరోనా బారిన పడ్డట్లు తెలుస్తోంది. ప్రముఖ సింగర్ సునీత అలాగే మాళవిక లకు ఈ వైరస్ సోకిందట. తాజాగా వీరిద్దరు కూడా ఒకే సింగింగ్ షోలో పాల్గొన్నారని.. ఆ సెట్ లోనే ఇద్దరికి వైరస్ సోకిందని సమాచారం. అయితే ఆ ప్రోగ్రాం చేసిన వారితో పాటు ఇంకా చాలామంది సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. సింగర్ సునీత మాళవిక లలో కరోనా వైరస్ లక్షణాలు పెద్దగా లేకపోవడంతో ఈ ఇద్దరు ప్రస్తుతానికి హోమ్ క్వారంటైన్లో ఉన్నారట. వీరిద్దరూ కరోనా బారిన నుండి త్వరగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఈ వరుస సినీ సెలబ్రిటీల కరోనా కేసుల గురించి తెలిసి అభిమానులు.. నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. అందరూ కూడా వారంతా త్వరగా ఆరోగ్యంగా బయటికి రావాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.