ఆంధ్రా అమ్మాయి వింత గాథ వినుమా

0

రన్ రాజా రన్ ఫేం సీరత్ కపూర్ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కాని ఎక్కువ శాతం ఆమెకు నిరాశ పర్చాయి. ఇటీవల ఆమె నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని సీరత్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. బోల్డ్ గా ఆ సినిమాలో కనిపించిన సీరత్ కపూర్ ఈసారి అందుకు పూర్తి విభిన్నంగా ‘మా వింత గాథ వినుమా’ అనే చిత్రంలో నటిస్తోంది. గత సినిమాలో ఎంత బోల్డ్ పాత్రలో అయితే నటించిందో అందుకు పూర్తి విరుద్దంగా పద్దతి అయిన ఒక పల్లెటూరు అమ్మాయిగా జీవితంపై చాలా లక్ష్యాలు ఉన్న యువతిగా కనిపించబోతుందట.

తాజాగా సీరత్ కపూర్ మాట్లాడుతూ తాను సాంప్రదాయాలకు విలువ ఇచ్చే ఆంధ్రా అమ్మాయి పాత్రలో కనిపించబోతున్నాను. ‘మా వింత గాథ వినుమా’ సినిమాలో నేను ఎలా ఉండబోతున్నాను మీకు చూపించేందుకు చాలా ఆతృతగా ఉన్నాను. తప్పకుండా మీ అందరిని మరోసారి మెప్పించే విధంగా మీ ముందుకు వస్తానంటూ సీరత్ వ్యాఖ్యలు చేసింది. ఆరు నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో జాయిన్ అవ్వడం ఆనందంగా ఉందని ప్రస్తతుం పలు కథలు వింటున్నాను. మా వింథ గాథ వినుమా కాకుండా మరో సినిమాను త్వరలో ఓకే చేస్తానంటూ కూడా ఈమె పేర్కొంది.