Templates by BIGtheme NET
Home >> Cinema News >> శృంగార తార ‘షకీలా’ బయోపిక్ టీజర్

శృంగార తార ‘షకీలా’ బయోపిక్ టీజర్


దక్షిణాది చిత్ర పరిశ్రమలో శృంగార తారగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి షకీలా. 90స్ లలో తన చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. తెలుగు తమిళం మలయాళం భాషలో అడల్ట్ చిత్రాలలో నటించిన షకీలా స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మూవీ తెరకెక్కింది. ”షకీలా” పేరుతో రూపొందిన ఈ బయోపిక్ లో రిచా చద్దా ప్రధాన పాత్ర పోషించింది. అడల్ట్ చిత్రాలలో నటించిన షకీలా.. స్టార్ హీరోలకు పోటీగా నిలిచింది. ఇప్పుడు ఆమె జీవిత చరిత్ర ఆధారంగా మూవీ తెరకెక్కింది. ”షకీలా” పేరుతో రూపొందిన ఈ బయోపిక్ లో రిచా చద్దా ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘షకీలా’ సినిమ విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

‘షకీలా’ టీజర్ లో ”1990ల్లో థియేటర్లను నింపాలంటే ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ఒకే పేరు వినిపించేది. ఆ పేరే షకీలా. కరోనా కారణంగా ప్రస్తుతం మూతబడిన థియేటర్లు తెరుచుకున్నాక మళ్లీ షకీలా పేరు వినిపించనుంది” అని చెప్పుకొచ్చారు. షకీలా పాత్రలో రిచా చద్దా అద్భుతంగా నటిస్తూనే అందాలు వలకబోసినట్లు అర్థం అవుతోంది. ఇందులో పంకజ్ త్రిపాఠి – రాజీవ్ పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ బయోపిక్ లో షకీలా సక్సెస్ ఫెయిల్యూర్స్.. ఫ్యామిలీ మెంబెర్స్ చేతిలో ఎలా మోసపోయింది అనేది చూపించనున్నారు. ఈ చిత్రానికి ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వం వహించారు. ‘షకీలా’ బయోపిక్ కోసం ఇప్పుడు టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ బాలీవుడ్ లో కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.