Templates by BIGtheme NET
Home >> Cinema News >> అరే.. హన్సిక పెళ్లికూతురిలా సిగ్గుల మొగ్గాయెను

అరే.. హన్సిక పెళ్లికూతురిలా సిగ్గుల మొగ్గాయెను


తమిళ హీరో శింబుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి వార్తల్లో నిలిచింది హన్సిక. కొన్నాళ్ల పాటు తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా సాగిన వీరి ప్రేమాయణం ఇద్దరి మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముగిసింది. ఆ తరువాత సినిమాలపై దృష్టిపెట్టిన హన్సిక క్రమ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. క్రేజీ ఆఫర్లు అంటూ హన్సిక చేతిలో ఏమీ లేవు.

చాలా రోజుల తరువాత `తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్` ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫరవాలేదనిపించినా ఈ మూవీ తరువాత మాత్రం తెలుగులో మరో అవకాశాన్ని పొందలేకపోతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో హీరోలు. … హీరోయిన్ లు వరుసగా పెళ్లికి సిద్ధమవుతుండటంతో హన్సిక కూడా త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నట్టుగా కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయ.

ఈ నేపథ్యంలో హన్సిక ఇన్ స్టాలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. లైట్ కలర్ లెహంగాలో హన్సిక పెళ్లికూతురులా సిగ్గుల మొగ్గవుతూ గింగిరాలు తిరుగుతున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో హన్సిక పెళ్లి కూతురులా ఫీలవుతూ సిగ్గుపడుతూ సర్ ప్రైజ్ చేస్తోంది.