Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాపై ఎయిర్ఫోర్స్ ఫైర్.. ఆ డ్రెస్సెంటీ? భాషేంటి?

‘ఏకే వర్సెస్ ఏకే’ సినిమాపై ఎయిర్ఫోర్స్ ఫైర్.. ఆ డ్రెస్సెంటీ? భాషేంటి?


బాలీవుడ్ నటుడు అనిల్కపూర్ .. ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఏకేవర్సెస్ఏకే’ వివాదంలో చుట్టుకున్నది. విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో డిసెంబర్ 24న విడుదల కానున్నది. అయితే ఈ నెల 7న సినిమా ట్రైలర్ రిలీజ్చేశారు. ఈ ట్రైలర్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనిల్ కపూర్ ఈ చిత్రంలో ఎయిర్ఫోర్స్ అధికారిగా పనిచేస్తున్నారు. అయితే అతడు వేసుకున్న ఎయిర్ఫోర్స్ యూనిఫామ్ సరిగ్గా లేదని.. వాడిన భాష కూడా ఎంతో అభ్యంతరకంగా ఉందని ఎయిర్ఫోర్స్ పేర్కొన్నది. ఈ మేరకు నెట్ఫ్లిక్స్.. అనిల్కపూర్ను ట్యాగ్చేస్తూ ఎయిర్ఫోర్స్ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్పై అనిల్కపూర్ స్పందించారు. ‘ ఏకే వర్సెస్ ఏకే ట్రైలర్ కొంతమందిని బాధపెట్టిందని తెలిసింది. భారత వైమానిక దళం యూనీఫాం ధరించి అటువంటి భాషను మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నాను’ అంటూ అనిల్కపూర్ ట్వీట్చేశారు. అయితే ట్రైలర్లోనే ఇలా ఉంటే సినిమా రిలీజ్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అని ఈ చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారట. ఎయిర్ఫోర్స్ ఇండియన్ ఆర్మీ సంబంధిత కథాంశాలతో సినిమాలను తెరకెక్కించేటప్పుడు దర్శకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడాకొట్టినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా ఏకే వర్సెస్ ఏకే పరిస్థితి కూడా అలాగే అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మిస్తున్నాడు. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో వస్తున్న చాలా సినిమాలు వివాదాలను ఎదుర్కొంటున్నాయి.

దీంతో ఓటీటీపై కూడా సెన్సార్ విధించాలని కేంద్రం యోచిస్తున్నది. ప్రస్తుతం థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోకపోవడంతో ఓటీటీల హవా నడుస్తున్నది. దీంతో దర్శకనిర్మాతలంతా వీటిపైనే దృష్టిసారించారు. ఓటీటీలో సెన్సార్ లేకపోవడంతో దర్శకనిర్మాతలు స్వేచ్ఛగా సినిమాలు తీస్తున్నారు. చాలా మంది ఈ స్వేచ్ఛను క్రియేటివిటీ ప్రదర్శించేందుకు వాడుకుంటున్నారు. కానీ మరికొందరు కేవలం బూతు కంటెంట్ను మాత్రమే నమ్ముకొని వివాదాల్లో చిక్కుకుంటున్నారు.