Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఒళ్లంతా ప్యాచీలు ఇదేమి ఫ్యాషన్ షాలినీ?

ఒళ్లంతా ప్యాచీలు ఇదేమి ఫ్యాషన్ షాలినీ?


షాలిని పాండే.. అర్జున్ రెడ్డి బ్యూటీగా బాలీవుడ్ లోనూ గొప్ప గౌరవం అందుకుంటోంది. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ చిత్రాలకు సంతకాలు చేసి ఆశ్చర్యపరిచింది.

`నిశ్శబ్ధం` ఫ్లాపయ్యాక తెలివిగా ఈ బ్యూటీ బేస్ మెంట్ మార్చేసింది. ప్రస్తుతం జయేష్ భాయ్ జోర్దార్.. మహారాజా అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. జయేష్ భాయ్ లో రణవీర్ సింగ్ లాంటి క్రేజీ హీరో సరసన నటిస్తోంది. మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న మహారాజా చిత్రంలోనూ నాయికగా ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల ఈ సినిమాలతో షాలిని బిజీగా ఉంది.

మరోవైపు సోషల్ మీడియాల్లోనూ షాలిని చాలా చురుగ్గా ఉంది. ఇన్ స్టాలో రెగ్యులర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ వేడి పెంచేస్తోంది. ఇంతకుముందు గ్రాఫిటీ బ్యాక్ గ్రౌండ్ ఫోటోషూట్ .. ఆరెంజ్ డ్రెస్ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇంతలోనే మరో స్పెషల్ లుక్ తో షాలిని ప్రత్యక్షమై షాకిచ్చింది.

షాలిని ఇటీవల పూర్తిగా స్లిమ్మయ్యింది. అందుకే స్లిమ్ అండ్ ట్రిమ్ షాలిని పాండే ప్యాచ్ వర్క్ ఫ్యాషన్ తో షాక్ కి గురి చేస్తోంది. ప్యాట్రన్ ఫాబ్రిక్ మల్టీ ప్యానెళ్లతో సెట్ చేసిన డిజైనర్ డ్రెస్ లో షాలిని స్పెషల్ గా కనిపిస్తోంది. క్యూటీ ఫ్యాషన్ సెన్స్ ఖచ్చితంగా తెలివైన ఎంపిక అనే చెప్పాలి. షాలిని సెలక్షన్ సృజనాత్మక దుస్తులు చిక్ వైబ్ ను జోడించాయి. షీ డ్యూటీ న్యూట్రల్ థీమ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.