రఘు గుర్తున్నాడా.. రెహమాన్ అతడికి రిలేటివే.. కుమార్తె స్టార్ హీరోయిన్ కూడా

0

హీరో రఘు గుర్తున్నాడా.. ఎయిటీస్ నైన్టీస్ లో మలయాళంలో అతడో సూపర్ స్టార్. అతడి అసలు పేరు రషిన్ రెహ్మాన్. మలయాళంలో 1983లోనే అతడి కెరీర్ మొదలైంది. ఆ తర్వాత చిన్న వయసులోనే హీరో గా మారి వందల సినిమాల్లో నటించి స్టార్డం సంపాదించారు. నైన్టీస్ వరకు మలయాళంలో ఆయన హవా కొనసాగింది. ఆ తర్వాత ఆయన తన నట ప్రస్థానాన్ని తెలుగు తమిళ భాషల్లో కొనసాగించారు.

తెలుగులో చిన్నారి స్నేహం సమరం రాసలీల ఆలయం రేపటి రౌడీ వంటి పలు చిత్రాల్లో నటించారు. ఆయన తెలుగుకంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేశారు. 90 ల నుంచి ఇప్పటివరకు తమిళంలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన తెలుగులో కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. ప్రభాస్ బిల్లా శర్వానంద్ అందరి బంధువయ గోవిందుడు అందరివాడేలే జనతా గ్యారేజ్ అంతరిక్షం వంటి సినిమాల్లో నటించారు. ఆయన గురించి పలు ఆసక్తికరమైన సంగతులు చాలా మందికి తెలియదు.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రఘుకు స్వయానా తోడల్లుడు. రఘు రెహమాన్ భార్యలు స్వయంగా అక్కా చెల్లెళ్లు కూడా. రఘుకు ఇద్దరు కుమార్తెలు. వారిలో రషితా రెహ్మాన్ మలయాళం లో హీరోయిన్ గా రాణిస్తోంది. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. ఇటీవల రఘు మలయాళం లో రీ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఆయన తెలుగు తమిళ మలయాళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. మలయాళంలో వచ్చిన లూసీఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో మాతృకలోని వివేక్ ఒబెరాయ్ పాత్రకు రఘును సంప్రదిస్తున్నారని తెలిసింది.