వేడెక్కిస్తున్న హాట్ స్విమ్ సూట్ అందాలు..!

0

సినీ ఇండస్ట్రీకి సంబంధించి అందాలను ఆరాధించే గ్లామర్ ప్రియులకు ఢిల్లీ బ్యూటీ శ్రద్దా ఆర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే బాలీవుడ్ టు టాలీవుడ్ వరకు ఈ వయ్యారి గ్లామర్ షో ద్వారా అందరికి సుపరిచితం అయింది. న్యూఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ 33ఏళ్ల బ్యూటీ.. ముంబై యూనివర్సిటీ నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో పట్టా పొందింది. అయితే కాలేజీ టైంలోనే గ్లామర్ ఫీల్డ్ పై మక్కువతో ముంబైకి మకాం మార్చేసింది. ఆ సమయంలో పలు టాలెంట్ షోలలో పాల్గొని చివరికి.. 2006లో కల్వనీన్ కాదలి అనే తమిళ సినిమాతో సినీకెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అలాగే షాహిద్ కపూర్ సరసన పాఠశాల సినిమాలో కూడా మెరిసింది.

ఇక 2007లో గొడవ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది. కానీ డెబ్యూ మూవీ ప్లాప్ అయ్యేసరికి మళ్లీ గ్యాప్ తీసుకొని 2010లో కోతిమూక – రోమియో సినిమాలు చేసింది. ఆ సినిమాలు కూడా అమ్మడికి పెద్దగా గుర్తింపు తేకపోవడంతో వేరే భాషల్లో ప్రయత్నాలు చేసింది. ఆ విధంగా శ్రద్దా తమిళ – మలయాళం – కన్నడ – పంజాబీ భాషల్లో సినిమాలు చేసింది. ఎక్కడా కెరీర్ క్లిక్ అవ్వకపోవడంతో అమ్మడు ముంబైకి వెళ్ళిపోయి షోలు – సీరియల్స్ లో కెరీర్ కంటిన్యూ చేసింది. ఎక్కువగా టీవీ షోలు – సీరియల్స్ ద్వారా అమ్మడు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సినిమాలు తక్కువ చేసింది కానీ శ్రద్ధా అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసు దోచేసుకుందని చెప్పవచ్చు.

అందుకే ఇప్పటికి అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ పెడితే ఇంకా మీ ఆకట్టుకునే అందాలను బాగా మిస్ అవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తుంటారు ఫ్యాన్స్. నిజానికి సినిమాలకంటే కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటోంది శ్రద్ధా. తాజాగా కుర్రకారుకు మతులుపోయే విధంగా స్విమ్ సూట్ పిక్స్ పోస్ట్ చేసింది. ఇదివరకు సినిమాల్లో బికినీ షోతో అదరగొట్టిన శ్రద్ధ వయ్యారాలను ఇలా స్విమ్ సూట్ లో చూసేసరికి ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ఫ్లవర్స్ తో కూడిన స్విమ్ సూట్ లో షవర్ బాత్ చేస్తూ అందాలన్నీ ప్రదర్శించింది అమ్మడు. టాప్ టు బాటమ్ బికినీకి ఏమాత్రం తీసిపోకుండా అందాలను ఫోటోలలో కవర్ చేశారు. ప్రస్తుతం వయ్యారి హాట్ షోకు ఫిదా అయిపోయి పిక్స్ వైరల్ చేస్తున్నారు నేటిజన్లు.