నాగార్జున గారి జ్ఞాపకాలను మర్చిపోలేనంటోది

0

టాలీవుడ్ లో హీరోయిన్ గా శ్రియ అడుగు పెట్టి దాదాపుగా 20 ఏళ్లు అవుతోంది. ఇప్పటికి ఈమె హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తుంది అంటే ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఇష్టం సినిమాతో 16 ఏళ్ల వయసులో శ్రియ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ వెంటనే నాగార్జున సంతోషం సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో శ్రియ వెనుదిరిగి చూసుకోలేదు. సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఉండి టాలీవుడ్ లోని దాదాపు యంగ్ సీనియర్ స్టార్ హీరోలతో నటించేసింది.

పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కూడా శ్రియ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు హిందీ సినిమాలు మూడు నాలుగు ఉన్నాయి. ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా నటిస్తోంది. ఇటీవల శ్రియ ఒక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్ ఆరంభం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక డాన్స్ వీడియో చేయగా అందులో తనను చూసిన తెలుగు ఫిల్మ్ మేకర్స్ ఇష్టం సినిమా కోసం తీసుకున్నారు. ఆ తర్వాతా వరుసగా ఆఫర్లు వచ్చాయని ఆమె చెప్పుకొచ్చింది.

సంతోషం సినిమా చేస్తున్న సమయంలో నా వయసు చాలా తక్కువ. అప్పటి జ్ఞాపకాలను నేను ఎప్పటికి మర్చి పోలేను. నాగార్జున గారితో నటించడం చాలా సౌకర్యంగా ఉంటుంది. ఆయనతో ఇప్పటి వరకు పలు సినిమాల్లో నటించినా కూడా మరిన్ని సినిమాల్లో నటించాలని కోరకుంటున్నాను. నాకు ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా క్లోజ్. ముఖ్యంగా అమలా గారితో నాకు మంచి పరిచయం ఉంది. నాగార్జున గారితో సినిమా అంటే నేను ఎప్పుడు రెడీగా ఉంటానంటూ గతంలోనూ శ్రియ వెళ్లడించింది.