ఒంటరితనం అంటే భయం కాదు ఇష్టం : శృతి

0

అమ్మాయిలు ఒంటరిగా ఉండాలంటే భయపడతారు. కాని తనకు మాత్రం ఒంటరితనం అంటే చాలా ఇష్టమని మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ చెప్తోంది. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాలని కోరుకుంటాను. చాలా మంది ఒంటరిగా ఉండటం బోర్ అని.. ఈ లాక్ డౌన్ లో ఒంటరిగా ఎలా ఉండాలో అర్థం కావడం లేదని అంటున్నారు. కాని నాకు మాత్రం ఒంటరితనం అంటేనే చాలా ఇష్టం. ఒంటరిగా ఉంటే ఎప్పుడు నాకు బోర్ గా అనిపించలేదు. ఈమె నటించిన తమిళ సినిమా ‘లాభం’ విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఒంటరితనంపై వ్యాఖ్యలు చేసింది.

చెన్నై ఎప్పుడు వచ్చినా కూడా డాడీని కలుస్తాను. ఆయన్ను కలిసిన తర్వాత నాకు నేను ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతాను. చెన్నైలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా ఒంటరితనంగా ఉండటానికే ఇష్టపడుతాను. చాలా కాలంగా నేను ఒంటరిగానే ఉంటున్నాను అంటూ చెప్పింది. ఒంటరిగా ఉన్న సమయంలో నేను వంట చేసుకుంటాను.. ఇంటిని సొంతంగా శుభ్రం చేసుకుంటాను.. నా బట్టలు నేను ఉతుక్కుంటాను. నా వంట పాత్రలు నేనే కడుక్కుంటాను. హీరోయిన్స్ అంట్లు తోముతారా అని కొందరు ఆశ్చర్యంగా అడుగుతారు. అవి అందరు చేయాల్సిన పనులే కదా ఎందుకు అంత ప్రత్యేకంగా వాటిని చూడటం అంది. మల్టీ ట్యాలెంటెడ్ అంటూ ఇప్పటికే నిరూపించుకుని శృతి హాసన్ ఇండిపెండెంట్ అమ్మాయిగా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది.