Templates by BIGtheme NET
Home >> Cinema News >> శ్రుతి హాసన్ తాజా పచ్చబొట్టు ఎక్కడ? ఎవరిది? ఎందుకు?

శ్రుతి హాసన్ తాజా పచ్చబొట్టు ఎక్కడ? ఎవరిది? ఎందుకు?


వయసు పెరిగే కొద్దీ మనిషి ఆలోచనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రముఖుల్లో అది మరింత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. గ్లామర్ ప్రపంచంలో తళుక్కుమనే తారల మాటల్లోనూ.. చేతల్లోనూ ఇది తప్పనిసరి.

ఏళ్లకు ఏళ్లుగా ఇండస్ట్రీలో తన సత్తా చాటుతున్న శ్రుతిహాసన్ తాజాగా మరో పచ్చబొట్టును వేసుకుంది. అయితే.. ఇప్పటివరకు ఆమె వంటి మీద ఉన్న టాటూలకు భిన్నమైనదిగా దీన్ని చెప్పాలి.

తాజాగా ఆమె వేసుకున్న పచ్చబొట్టును చూస్తే.. శ్రుతిలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపించటమే కాదు.. ఆమెలోని కొత్త కోణాన్ని అందరికి అర్థమయ్యేలా చేసిందని చెప్పాలి. నలభయ్యో పడికిదగ్గర అవుతున్న ఈ ముద్దుగుమ్మ.. స్టైల్ కు.. ష్యాషన్ కు ఐకాన్ లా వ్యవహరిస్తుంటారు. రోటీన్ కు ట్రెండ్ కు భిన్నంగా వ్యవహరించే ఆమె.. తాజాగా వేయించుకున్న పచ్చబొట్టు అందరిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఆమె ఒంటి మీద ఉన్న పచ్చబొట్టులను చూస్తే.. మణికట్టు పైన గులాబీ.. చెవి వెనుక సంగీతాన్ని గుర్తు చేసేలా పచ్చబొట్టు వేయించుకోవటం తెలిసిందే. తాజాగా వేయించుకున్న పచ్చబొట్టు మాత్రంఈ రెండింటికి భిన్నమైనది. అసలు శ్రుతి నుంచి ఏ మాత్రం అంచనా వేయలేనిదిగా చెబుతున్నారు.

తాజాగా ఆమె తన ఇష్టదైవం మురుగన్ ఆయుధాన్ని టాటూలా వేయించుకున్నారు. అంతేకాదు..తమిళంలో తన పేరును వేయించుకోవటం గమనార్హం. తాను వేయించుకున్న కొత్త టాటూను ఇన్ స్టాలో షేర్ చేసిన శ్రుతి.. తానెప్పుడూ అధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంటానని చెప్పారు.

తన మనసులో మురుగన్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని.. తాజా పచ్చబొట్టుతో తనలోని భక్తిని ప్రదర్శించాలని భావించినట్లుగా చెప్పుకొచ్చారు. మొత్తానికి శ్రుతిలో కొత్త మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించట్లేదు?