విరూపాక్ష 3 రోజుల కలెక్షన్స్.. ఇంకా టార్గెట్ పూర్తవ్వలే!


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరుపాక్ష సినిమా మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా మంచి విజయాన్ని అందించింది. హారర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా మొదటి రోజే పాజిటివ్ అందుకోవడంతో ఓపెనింగ్ కలెక్షన్స్ అద్భుతంగా వచ్చాయి.

ఇక వీకెండ్ లో పోటీగా పెద్దగా ఏ సినిమాలు లేకపోవడం కూడా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ అందుకున్న విరూపాక్ష సినిమా రెండవ రోజు 5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక మూడవ రోజు కూడా దాదాపు అదే తరహాలో 5.7 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఫస్ట్ వీకెండ్ షేర్ కలెక్షన్స్

ఏపీ తెలంగాణ : 16.36 కోట్లు
కర్ణాటక+ROI : 1.41 కోట్లు
ఓవర్సీస్ : 3.05 కోట్లు

వరల్డ్ వైడ్ : 20.82 కోట్లు షేర్ 27.75 కోట్లు గ్రాస్

ఇక మొత్తం మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విరూపాక్ష సినిమాకు 16.36 కోట్ల షేర్ కలెక్షన్స్ 27.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కాయి. ఇక కర్ణాటకలో చూసుకుంటే 1.41 కోట్లు ఓవర్సీస్ లో 3.05 కోట్లు వచ్చాయి.

మొత్తంగా మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా విరూపాక్ష సినిమా 20.82 కోట్ల షేర్ కలెక్షన్స్ 27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తంగా 22.20 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక 23 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ సెట్ అయింది.

ఇప్పటివరకు మూడు రోజుల్లో 20.82 కోట్లు రాగా సినిమా టార్గెట్ కు ఇంకా కేవలం 2.80 కోట్లకు తక్కువగా ఉంది. ఇక సోమవారం నుంచి కూడా సినిమాకు మినిమం కలెక్షన్స్ వచ్చినా కూడా ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి. వరుస అపజయాలతో సతమతమైన సాయి ధరమ్ తేజ్ కు యాక్సిడెంట్ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమా బౌన్స్ బ్యాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

యుఎస్ లో కూడా ఇప్పటికే వన్ మిలియన్ మార్క్ దగ్గరగా ఈ సినిమా చేరువవుతోంది. ఇక వీకెండ్ అనంతరం కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి మొత్తంగా విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తుందో చూడాలి.