Home / Cinema News / హీరో పై ఎల్లలు దాటిన అభిమానం… వీడియో షేర్ చేసిన శ్వేతా సింగ్…!

హీరో పై ఎల్లలు దాటిన అభిమానం… వీడియో షేర్ చేసిన శ్వేతా సింగ్…!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న టాలెంటెడ్ హీరో ఇలా అర్థాంతరంగా తనువు చాలించడాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణానికి ఇండస్ట్రీలోని నెపోటిజం మరియు కొందరు వ్యక్తులే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ‘బాయ్ కాట్ బాలీవుడ్’ అంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ క్రమంలో సుశాంత్ సూసైడ్ చేసుకోలేదని.. అతనిని ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు తీరుసరిగా లేదని.. సీబీఐకి అప్పగిస్తే నిజానిజాలు బయటకి వస్తాయని డిమాండ్ చేసారు.

అయితే ఎవరైనా సెలబ్రిటీ అనుమానాస్పదంగా మరణిస్తే వారమో పది రోజులో దాని మీద ప్రొటెస్ట్ చేసి సైలెంట్ అయిపోయేవారు. కానీ యువ హీరో సుశాంత్ జూన్ 14న మరణించగా అప్పటి నుంచి కూడా సుశాంత్ కి న్యాయం జరగాలని ఇప్పటికీ దీనిపై సోషల్ మీడియా ద్వారా #warriors4ssr #justiceforsushantsinghrajput #ssrinourhearts హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విదేశాలలో కూడా సుశాంత్ సింగ్ కి న్యాయం జరగాలని కోరుకుంటూ హోర్డింగ్స్ పెడుతున్నారు. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ ఇంస్టాగ్రామ్ లో మీరు మా హృదయాలని కొల్లగొట్టారు అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో కాలిఫోర్నియాలో ”#జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 1986 – 2020” అని హోర్డింగ్ పెట్టి ఉంది.

ఇదిలా ఉండగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో సుశాంత్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరుగురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా ప్రకటించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా రియా తం‍డ్రి ఇంద్రజిత్ చక్రవర్తి ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజరు శామ్యూల్ మిరిండా ఏ6గా సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజరు శ్రుతి మోదీతో పాటు పలువురును ఈ కేసులో నిందితులుగా చేర్చింది.

 

View this post on Instagram

 

❤️❤️❤️ You are beating in our hearts #warriors4ssr #justiceforsushantsinghrajput #godiswithus #ssrinourhearts

A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on

Related Images:

SEO Keywords: Not Found

About TeluguNow .

Reviews, Live Updates, Telugu cinema news, Telugu Movies Updates, Latest Movie reviews in Telugu, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets Telugu Movie Review, Telugu Movie Ratings, Telugu News, News in Telugu, AP Politics, Telangana News, Gossips, Telugu Cinema News, Wallpapers, Actress Photos, Actor Photos, Hot Photos,
Scroll To Top