గుట్టు చప్పుడు కాకుండా కత్తి లాంటి అత్తను దించారు

0

కొడుకు కోసం ఏం చేసేందుకైనా వెనకాడడు ఆ స్టార్ డైరెక్టర్. వారసుడిని ఎట్టిపరిస్థితిలో స్టార్ హీరోని చేయడమే ఆయన ధ్యేయం. అందుకోసం మొదటి ప్రయత్నమే స్థాయిని మించిన బడ్జెట్ పెట్టి సినిమాని తెరకెక్కించారు. అయితే అది ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. అయినా వారసుని నటనకు పేరొచ్చింది. ఈ కుర్రాడు గట్సీగా నటించాడు! అంటూ ప్రశంసలు కురిపించారు ఆడియెన్స్. అయితే వారసునికి బాలనటుడిగా ఉన్న అనుభవంతో ఎక్కడా తొట్రు పడకుండా హీరోయిజాన్ని చూపించడంలో తొలి ప్రయత్నమే సక్సెసవ్వడంతో ఆ స్టార్ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ రెట్టింపు అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తండ్రి కొడుకులు ఎవరో చెప్పాల్సిన పనే లేదు. ఆకాష్ పూరి- పూరి జగన్నాథ్.

ఆకాష్ నటించిన మెహబూబా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా పట్టువదలని విక్రమార్కుడిలో రెండో సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట. ఈ సినిమా కోసం ఓ మోస్తరు పెద్ద బడ్జెట్ నే వెచ్చించి తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ని పూర్తి చేసారు. క్రైసిస్ వల్ల పెండింగ్ షూట్ వాయిదా పడింది. ప్రస్తుతం ఈ పనుల్ని పూర్తి చేసేందుకు సదరు దర్శకుడు రెడీ అవుతున్నారు.

ఇకపోతే ఈ ప్రాజెక్టులో కత్తి లాంటి అత్త పాత్ర ఫ్యాన్స్ ని టెంప్ట్ చేస్తుందని కూడా గాసిప్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరా అత్త? అంటే.. వెటరన్ బ్యూటీ సిమ్రన్ అని తెలిసింది. ఆకాష్ కి అత్తగా సిమ్రన్ ట్రీట్ నభూతోనభవిష్యతి అన్న తీరుగా ఉంటుందట. సిమ్రాన్ ఈ చిత్రంలో హీరోయిన్ కేతిక శర్మకి తల్లిగా నటిస్తోంది.. అంటే హీరో ఆకాష్ పూరికి అత్త అన్నమాట. ఇక ఈ మూవీలో కేతిక అందచందాలు కనువిందు చేస్తాయని ఇంతకుముందు రిలీజైన రొమాంటిక్ పోస్టర్లు చెప్పకనే చెప్పాయి. అనీల్ పాదూరి దర్శకత్వం వహిస్తుండగా పూరి కనెక్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.