అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహమాటపడన తెలుగు అమ్మాయి

0

శోభితా ధూళిపాళ.. అచ్చ తెలుగు ఆంధ్రా అమ్మాయి. తెనాలికి చెందిన ఈ సూపర్ హాట్ గాళ్ అందాల పోటీల రాణిగా మెరిసింది. అందుకే బాలీవుడ్ కనెక్టివిటీ ఎక్కువ. ఈ భామ తెలుగులో కంటే ముందు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మోడల్ గా మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ తన సత్తా చిటిన శోభిత బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన సైకో థ్రిల్లర్ `రమన్ రాఘవ్ 2.O` చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత అడివి శేష్ నటించిన హిట్ ఫిల్మ్ `గూఢచారి`తో తెలుగు ప్రేక్షకులకి చేరువైంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తెలుగులో ఆమె టాలెంట్ కి తగ్గ అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. దాదాపు రెండేళ్ల విరామం తరువాత అడివిశేష్ మరో అవకాశం ఇచ్చాడు. సందీప్ ఎన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా `మేజర్` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో శోభిత హీరోయిన్గా నటిస్తోంది.

అవకాశం ఏమాత్రం చిక్కిన తన అందాల ప్రదర్శనకు ఏ మాత్రం మొహమాటపడన శోభిత తన హాట్ లుక్స్ తో హీటెక్కిస్తోంది. బికీనీ ధరించి ఈ గూఢచారి గాళ్ చేసిన రచ్చ ఓ రేంజ్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శోభిత టాలెంట్ చూసిన మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో అవకాశం ఇచ్చారు. ఈ మూవీతో శోభిత కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.