కలకలం.. ట్రంప్ కు విష పదార్థం

0

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన అమెరికా అధ్యక్షుడికే కొంతమంది విషం పంపిన సంఘటన సంచలనమైంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు విషంతో కూడిన పార్శిల్ రావడం కలకలం రేపింది.

‘రిసిన్’ అనే విషపదార్థాన్ని వైట్ హౌస్ అడ్రస్ తో పంపించారని.. దీన్ని చెకింగ్ వద్ద గుర్తించి నిలిపివేశామని అధికారులు తెలిపారు. దీంతో తీవ్ర కలకలం రేపింది. చూడకుండా లోపలికి తీసుకెళ్లినా.. అందులో ఏమైనా గ్యాస్ లాంటిది ఉన్నా పెద్ద ప్రమాదమే సంభవించేది.

కాగా అధ్యక్షుడికి ఇలాంటి విషపు పార్శిల్లు పంపడం ఇదే తొలిసారి కాదు.. ఇది వరకు కూడా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు ఆయనకు సైతం ఇలాంటి విషంతో కూడిన పార్శిల్ ను కొందరు దుండగులు పంపారు.

ఆముదపు గింజల నుంచి ఈ ‘రిసిన్’ అనే విష పదార్థాన్ని తీస్తారు. దీన్ని తీసుకున్న 36-72 గంటల్లో మనిషి ప్రాణాలు కోల్పోతారని.. ఇది స్లో పాయిజన్ అని అధికారులు గుర్తించారు.