సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ ఫిలాసఫీ పేరుతో ఓ గ్లిమ్స్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రిలేషన్ షిప్ వద్దు అని ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ యూత్ ని మోటివేట్ చేయడానికి విరాట్ 108 శ్లోకాలతో పుస్తకం రాసినట్లు ఈ ప్రోమోలో చూపించారు.
ఇందులో శ్లోకం నెం.14గా ”ఏప్రిల్ ఫస్ట్ కి ఫూల్స్ డే అని తెలిసి కూడా ఫూల్ అయ్యేవాడు.. ప్రతిరోజూ ఫూల్ అవుతాడని తెలిసి కూడా పెళ్ళి చేసుకునే వాడు.. ఈ చరిత్రలో సుఖపడినట్లే లేదు” అని సాయి ధరమ్ తేజ్ చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. అలానే ‘అమ్మమ్మ కోసం పెళ్లి చేసుకుంటా.. అమ్మ కోసం తాళి కడతా.. నాన్న కోసం పిల్లల్ని కంటానంతావేంటి’ అని శ్లోకం నెం.27 లో ప్రశ్నిస్తున్నాడు విరాట్. త్వరలోనే మరిన్ని శ్లోకాలు ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు.