మిల్కీకి అయినా ముచ్చెమటలే..

0

పాల నురుగు దేహశిరులతో యూత్ కి గాలం వేసిన మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా దాదాపు 15 ఏళ్ల కెరీర్ ని ఎంతో సునాయాసంగా నడిపించేసింది. కెరీర్ లో ఫ్లాపులు ఎదురైనా తనదైన చాణక్యంతో రంగుల ప్రపంచాన్ని ఈదడంలో సక్సెసైంది. ఇప్పటికీ వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉందంటే తన శరీరానికి ఉన్న ఆ మిల్కీ టోన్ వల్ల.. ప్రతిభ వల్లనే. టాలీవుడ్ టు బాలీవుడ్ మిల్కీ బ్యూటీ జర్నీ గురించి చెప్పాల్సినదేమీ లేదు.

ఇప్పుడు ఈ ముంబై బ్యూటీ బాటలోనే మరో ముంబై బ్యూటీ బరిలో దిగుతోంది. దిల్లీకి చెందిన ప్రముఖ డాక్టర్ కుమార్తె అయిన సౌందర్య శర్మ గత కొంతకాలంగా బాలీవుడ్ క్రౌడ్స్ లో బాగా పాపులరవుతోంది. రెగ్యులర్ గా వేడెక్కించే ఫోటోషూట్లతో ఈ అమ్మడు యూత్ కి గాలం వేస్తోంది. వీలు కుదిరితే బాలీవుడ్ లో కుదరకపోతే సౌత్ లో ఏదో ఒక చోట గేమ్ ప్లాన్ చేయాలన్న తపనతో ఉంది. నిజానికి డెంటల్ డాక్టర్ అయిన సౌందర్య శర్మ కు బాలీవుడ్ అంటే ఉన్న క్రష్ వల్ల ఇటువైపు అడుగులు వేసింది.

ఇక నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో ఈ భామ అదిరిపోయే ట్రీటిస్తోంది. తన ప్రయత్నం చూశాక అయినా నిర్మాతలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేయకుండా ఉంటారా? పూరి కొరటాల బోయపాటి రావిపూడి.. వీళ్లలో ఎవరో ఒకరు సౌందర్య వైపు ఓ చూపు చూడకుండా ఉంటారా మరి?