రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లిసందడి సినిమా ఎంతటి ఘన విజయాన్నిసొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్ల లాభం వచ్చినట్లుగా నిర్మాతలు అంటూ ఉంటారు. అంతటి సక్సెస్ అయిన పెళ్లి సందడి సినిమా రీమేక్ కాని సీక్వెల్ కాని చేస్తే బాగుంటుందని చాలా కాలంగా కొందరు బలంగా కోరుకుంటున్నారు. ఈ సమయంలో రాఘవేంద్ర రావు ‘పెళ్లిసందD’ ని ప్రకటించాడు. ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని హీరోల విషయంలో మాత్రం సంబంధం అయితే క్లీయర్ గా కనిపిస్తుంది.
పెళ్లి సందడి సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించగా ‘పెళ్లిసందD’ సినిమాలో ఆయన తనయుడు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి తదుపరి ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. అయినా కూడా హీరో రోషన్ అంటూ ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. రాఘవేంద్ర రావు నిర్మాణంలో ఈ సినిమాను తనికెళ్ల భరణి తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయమై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీకాంత్ స్పెషల్ రోల్ ను ‘పెళ్లిసందD’ సినిమాలో చేసినట్లయితే తండ్రి కొడుకుల సినిమాగా మంచి పబ్లిసిటీ దక్కే అవకాశం ఉందంటున్నారు.