బాధితుల కోసం పోర్న్ స్టార్ భారీ సాయం

0

లెబనాన్ రాజధాని బీరూట్ లో బ్లాస్ట్ జరిగి వందలమంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గాయపడ్డారు. వీరిని ఆదుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ముందుకొస్తున్నారు.

ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా సాయం చేయడానికి ముందుకొచ్చి గొప్ప మనసు చాటుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పోర్న్ స్టార్ అయిన మియా ఖలీఫాకు యువతలో పిచ్చి క్రేజ్ ఉంది. అడల్ట్ ఇండస్ట్రీని ఆమె ఏలుతోంది. మియా ఖలీఫా సొంత దేశం కూడా లెబనాన్. తన జీవిత మనుగడ కోసం అడల్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

ఇటీవల తన సొంత దేశం లెబనాన్ లో బాధితుల కోసం మియా ఖలీఫా ముందుకొచ్చింది. ఆమె పోర్న్ చిత్రాల్లో వాడే కళ్లజోడు చాలా ఫేమస్. ఇప్పుడు లెబనాన్ బాధితుల కోసం దాన్ని ఆమె ఆన్ లైన్ లో వేలం వేసింది. కొన్ని గంటల్లోనే ఆ కళ్లజోడుకి భారీ స్థాయిలో డిమాండ్ దక్కింది. వేలం పాట ద్వారా ఇప్పటికే లక్ష డాలర్లను ఆమె సంపాదించింది.

పుట్టిన గడ్డపై జనాలు అల్లాడిపోతున్నారనే బాధ తనను ఎంతగానో బాధిస్తోందని.. అందుకే తన పోర్న్ సామగ్రి వేలం వేసి రుణం తీర్చుకుంటున్నాని మియా తెలిపింది.