మహేష్ భట్ కు సుచిత్ర సూటి ప్రశ్న

0

సుశాంత్ మృతి కేసులో రియా చక్రవర్తితో పాటు మహేష్ భట్ కూడా కీలక నింధితుడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయన రియాను చాలా ప్రభావితం చేశాడని.. సుశాంత్ మరియు రియాల మద్య ఆయన ఇన్వాల్వ్ మెంట్ కారణంగానే విభేదాలు వచ్చాయంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో మహేష్ భట్ ను సీబీఐ ఎంక్వౌరీలో ప్రశ్నిస్తారా లేదా అనేది చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా సుశాంత్ మృతితో మహేష్ భట్ కు సంబంధం ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ సమయంలో ప్రముఖ జర్నలిస్ట్ సుచిత్ర కృష్ణమూర్తి సోషల్ మీడియాలో మహేష్ భట్ ను ఉద్దేశించి.. సీబీఐ వారు మహేష్ భట్ ను ప్రశ్నించబోతున్నారా.. జూన్ 8న సుశాంత్ ను వదిలి బయటకు వచ్చేసిన రియా విషయంలో మహేష్ భట్ అంత వాత్సల్యం చూపించడానికి కారణం ఏంటీ అంటూ ప్రశ్నించింది. జూన్ 8న సుశాంత్ ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత మహేష్ భట్ తో ఆమె ఛాటింగ్ చేసింది. ఆ ఛాటింగ్ కు సంబంధించిన స్ర్కీన్ షాట్స్ బయటకు వచ్చాయి. అందులో మహేష్ భట్ రియాను ఓదార్చినట్లుగా ఉంది. రియా మాత్రం ఆయన తనకు తండ్రి సమానుడు అంటూ ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.