ఓనం స్పెషల్ గా హాట్ డాన్స్

0

ఓనం పండుగ సందర్బంగా మలయాళ మరియు తమిళ సినీ స్టార్స్ అంతా కూడా సోషల్ మీడియాలో హడావుడి చేశారు. చాలా మంది హీరోయిన్స్ నటీమణులు కేరళ సాంప్రదాయ చీర అయిన ఓనం చీరను కట్టుకుని ఓనం స్పెషల్ అంటూ ఫొటోలు వీడియోలు షేర్ చేశారు. ఎప్పుడు హాట్ డ్రస్ లతో స్కిన్ కనిపించేలా ఎక్స్ పోజ్ చేసే వారు ఓనం పండుగ అవ్వడంతో నిండుగా చీర కట్టుకుని వావ్ అనిపించుకున్నారు. అయితే ఒక్క నటి మాత్రం ఓనం పండుగ అయినా ఓనం చీర కట్టుకున్నా కూడా తన ఎక్స్ పోజింగ్ ను మాత్రం కంటిన్యూ చేసింది.

ఓనం చీరలో నడుము అందాలను చూపిస్తూ డాన్స్ చేసింది తమిళ నటి శివాని నారాయణ్. ఈ అమ్మడు ఓనం స్పెషల్ గా అభిమానులకు మరియు ఫాలోవర్స్ కు తన డాన్స్ వీడియోను షేర్ చేసింది ఆ వీడియోలో ఆమె స్టెప్పులు మరియు హిప్ మూమెంట్ అదిరి పోయింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రెటీలు చాలా రకాలుగా ఫొటోలు వీడియోలు చేశారు కాని శివాని నారాయణ్ చేసిన ఈ డాన్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండుగ పూట ఏంటీ ఈ రచ్చ అంటూ కొందరు విమర్శిస్తున్న వారు కూడా ఉన్నారు.