కేజీఎఫ్ 2 తర్వాత ప్రభాస్ ను ఫాలో అవ్వబోతున్న యశ్

0

సౌత్ ఇండియన్ సినిమాల స్థాయిని బాలీవుడ్ వారికి తెలియజేసిన హీరోలు ప్రభాస్.. యశ్ అనడంలో సందేహం లేదు. బాహుబలి.. సాహో సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ హీరోలను మించిన వసూళ్లను దక్కించుకున్నాడు. అక్కడ ఉన్న సూపర్ స్టార్స్ కూడా ప్రభాస్ తర్వాత స్థానంకు పడిపోయారు అనడంలో సందేహం లేదు. ఇక సౌత్ కే చెందిన యశ్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ను కలిగి ఉన్నాడు. కేజీఎఫ్ సినిమాతో యశ్ గురించి బాలీవుడ్ లో మాట్లాడుకోవడం ఎక్కువ అయ్యింది.

ఇక ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమా రూపొందుతోంది. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయితే యశ్ ఇక బాలీవుడ్ లో సెటిల్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ప్రభాస్ వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే హిందీ డెబ్యూ ‘ఆది పురుష్’ కు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పుడు యశ్ కూడా ప్రభాస్ ను ఫాలో అవ్వబోతున్నాడు. ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన క్రేజ్ మాదిరిగానే యశ్ కు కూడా కేజీఎఫ్ తో భారీ క్రేజ్ దక్కింది.

యశ్ ఆ క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా తన భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటున్నాడు. భారీ బడ్జెట్ సినిమాతో పాటు కేజీఎఫ్ తరహా యాక్షన్ సినిమానే యశ్ చేయాలనుకుంటున్నాడు. ఇదే సమయంలో బాలీవుడ్ లో కూడా నటించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా హింట్స్ ఇస్తున్నారు. ఒక వైపు కన్నడ స్ర్కిప్ట్ లు వినడంతో పాటు మరో వైపు ఈయన బాలీవుడ్ లో నటించేందుకు కూడా హిందీ ఫిల్మ్ మేకర్స్ కథలు వింటున్నాడు. కేజీఎఫ్ 2 తర్వాత యశ్ హిందీ సినిమానే చేస్తాడని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు కేజీఎఫ్ 2 పూర్తి అవ్వబోతుంది. కనుక కొత్త సినిమా పై వచ్చే ఏడాదిలో యశ్ ప్రకటన చేస్తాడని అంటున్నారు.