గోవా బ్యూటీ ఇలియానా వెబ్ సిరీస్ ఎంట్రీ

0

బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్స్ ఇప్పుడు ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెడుతున్నారు. కొందరు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తుంటే మరికొందరు మాత్రం ఓటీటీ కోసం వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఆఫర్లు లేని హీరోయిన్స్ కు ఇప్పుడు ఓటీటీ అనేది చాలా మంది ఛాన్స్ గా మారింది. గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఆఫర్లు లేక సౌత్ వైపు చూసింది. ఇక్కడ నుండి కూడా ఆమెకు ఎలాంటి ఛాన్స్ లభించలేదు. దాంతో ఆమె కెరీర్ ముగిసినట్లే అనుకున్నారు. కాని అనూహ్యంగా ఇల్లీ బేబీ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కు జోడీగా ఒక వెబ్ సిరీస్ లో నటించే అవకాశం దక్కించుకుంది.

ఇంగ్లీష్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కించుకున్న ‘లూథర్’ టీవీ సీరీస్ ను హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడీ అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ ఫిల్మ్ స్టార్స్ హృతిక్ రోషన్.. సైఫ్ అలీ ఖాన్.. సోనాక్షి సిన్హా వంటి వారు వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దం అయ్యారు. ఇప్పుడు అజయ్ దేవగన్ ఇలియానాలు కూడా ‘లూథర్’ రీమేక్ లో నటించబోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ ను అతి త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇండియన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్పలు చేర్పులు చేస్తూ స్ర్కిప్ట్ ను రెడీ చేశారట. ఈ వెబ్ సిరీస్ తో అయినా ఇల్లీ బేబీ మళ్లీ బాలీవుడ్ లేదా సౌత్ లో బిజీ అయ్యేనో చూడాలి.