సుశాంత్ కుటుంబంకు ఆ విషయం ముందే తెలుసా?

0

హీరో సుశాంత్ మృతికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రియా కారణం అంటూ ఆయన తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొదలైన ఉత్కంఠ ప్రస్తుతం సీబీఐ ఎంక్వౌరీ జరుగుతున్న కారణంగా త్వరలోనే నిజా నిజాలు బయటకు వస్తాయని నమ్మకంగా అనుకుంటున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యలు మాత్రం అతడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు.. రియా వల్ల అతడు చనిపోయాడు. డిప్రెషన్ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సుశాంత్ కు డిప్రెషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటీ అంటూ కుటుంబ సభ్యలు ప్రశ్నిస్తున్నారు.

సుశాంత్ మృతికి కారణం డిప్రెషన్ కానే కాదు అంటూ చాలా నమ్మకంగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతకు ముందు అసలు సుశాంత్ కు డిప్రెషన్ లేదు అంటూ వారు వాదిస్తున్న నేపథ్యంలో సుశాంత్ సోదరి కి చెందిన ఒక వాట్సప్ చాటింగ్ స్ర్కీన్ షాట్స్ బయట పడ్డాయి. అందులో సుశాంత్ ఆందోళనతో ఉన్న విషయం అతడు వేసుకోవాల్సిన మందుల విషయం ప్రస్తావించారు. సుశాంత్ వాడే మందుల ప్రస్కిప్షన్ ను ఆమె వాట్సప్ ద్వారా షేర్ చేయడం వంటివి చేసింది. కనుక కుటుంబ సభ్యులకు ముందు నుండే సుశాంత్ డిప్రెషన్ లో ఉన్నట్లుగా తెలుసు.

వారికి ముందే తెలిసినా కూడా సుశాంత్ పూర్తి ఆరోగ్యంగా ఉండేవాడు అంటూ అబద్దాలు చెబుతున్నారు అంటూ రియా మద్దతుదారులు అంటున్నారు. వారు మొత్తం కూడా రియాను ఈ కేసులో ఇరికించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనిపిస్తుంది. ఆమెకు న్యాయం జరగాల్సిందే అంటూ జస్టీస్ ఫర్ రియా అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను షేర్ చేస్తున్నారు. సీబీఐ ఎంక్వౌరీలో ఆ లీక్ అయిన వాట్సప్ ఛాట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు.