ట్యాలెంటెడ్ యాంకర్ విడాకుల ప్రచారానికి అలా చెక్

0

లోకులు పలు గాకులు.. ఎవరిని ఎలా బదనాం చేయాలి! అని ఆలోచిస్తారు. ఫలానా వాళ్లు అదంట కదా.. ఇదంట కదా!! అన్న అవాకులు చవాకులు చెప్పుకునేందుకు ఇష్టపడే ప్రపంచం ఇది. ప్రముఖ దర్శకుడు అన్నట్టు ఈ లోకులు శాడిస్టులు!!

ఏమో.. కారణం ఏదైనా కానీ.. ఇటీవల టాలీవుడ్ ట్యాలెంటెడ్ యాంకర్ సుమ కనకాలపై ఓ రూమర్ వినిపించింది. భర్త రాజీవ్ కనకాల నుంచి సుమ విడాకులు తీసుకుంటున్నారన్నది దాని సారాంశం. విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు విడాకుల పుకారు పరిశ్రమలో వ్యాపించింది. అయితే ఈ పుకార్లకు సుమ ఎంతమాత్రం స్పందించలేదు. నిశ్శబ్దంగా మౌన యోగినిలా తన హబ్బీతో ఆనందంగా ఉన్న ఒక ప్లెజెంట్ ఫోటోని షేర్ చేసి విడాకుల రూమర్ కి చెక్ పెట్టేసింది. ప్రస్తుతం ఈ ఫోటో దాంతో పాటే సుమ వినిపించిన కవిత యూత్ లో ఒకటే హాట్ టాపిక్ గా మారింది.

“నా ప్రియమైన రాజా.. నా ప్రేమ.. ఏకత్వం .. ఆనందం ఎప్పటికీ“ అంటూ భర్తపై తన లవ్ ని కురిపించింది. సుమ కవితాత్మక హృదయం తనకు మాత్రమే సాధ్యమయ్యే అద్భుతమైన తెలుగు పదజాలం ఇందులో కనిపిస్తోంది. ఇక భర్త అంటే ఎనలేని ప్రేమ ఉందని కూడా ఈ ఫోటో చెబుతోంది. టెలివిజన్ రంగంలో తిరుగులేని రాణి ఆమె. వృత్తిగత జీవితం.. వ్యక్తిగత జీవితం రెండింటినీ సమర్ధవంతంగా సమతుల్యం చేసే యాంకర్ గా అందరి గుండెల్లో నిలిచి ఉన్నారు.