పొట్టి ఫ్రాకులో మత్తెక్కించిన పటానీ

0

యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం కారణంగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది హాట్ బ్యూటీ దిషా పటాని. నిరంతరం జిమ్ లో కసరత్తులు చేసే వీడియోలు ఫోటోలతో ఆకట్టుకుంది. గత కొంత కాలంగా టూమచ్ హాట్ షోతో దుమారం రేపుతోంది. యుఎస్ కు చెందిన లో దుస్తుల కంపెనీ కెల్విన్ క్లెయిన్ తో ఒప్పందం కుదుర్చుకుని సోషల్ మీడియా వేదికగా సంచలనాలకు తెర తీసిన ఈ బ్యూటీ రచ్చ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

ప్రతీసారి ఏదో ఒక బ్రాండ్ కాంట్రాక్ట్ ని కుదుర్చుకుని భారీగానే ఆర్జిస్తోంది. సినిమాలతో పోలిస్తే ఈ హాట్ బ్యూటీ కమర్షియల్ ప్రకటనలతో దక్కించుకునే మొత్తమే ఎక్కువ. అంతేనా డైలీ తన హాట్ ఫోటోలతో ఇన్ స్టాలో రచ్చ చేస్తూనే వుంది. దిష ఇన్ స్టా తన హాటెస్ట్ ఫోటోలు వీడియోలతో స్టార్మ్ అవుతూనే వుంటుంది. లేటెస్ట్ గా ఎల్లో కలర్ ఫ్రాక్ ని ధరించి థైషోస్ చేస్తున్న ఫోటోలు తాజాగా రివీలయ్యాయి.

లేత పసుపు రంగు డిజైనర్ ఫ్రాక్ లో దిష థైషోకి కుర్రకారు పరేషాన్ అవ్వడం ఖాయమే. ఇలా చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపించడం దిషాకు కొత్తేమీ కాదు కానీ.. యూత్ క్లీన్ బౌల్డ్ చేసేందుకు ప్రతిసారీ ఏదో ఒక ట్రిక్కును ఫాలో అవ్వడమే స్పెషల్ అని చెప్పాలి. సన్ ఫ్లవర్స్ డ్రెస్సులో దిష మెరిసిపోతూ హోయలొలికించేస్తోంది. ప్రస్తుతం దిష ఫొటోలు సోషల్ మీడియాలో హీటెక్కించేస్తున్నాయి. సల్మాన్ భాయ్ సరసన భారత్ తర్వాత రాధే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.