పాన్ ఇండియా మంత్రం జపిస్తున్న పవర్ స్టార్

0

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల నడుమ ఆరోగ్యకరమైన ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ఒకరితో ఒకరు పోటీపడుతూ పాన్ ఇండియా స్టార్లుగా ఇరుగు పొరుగు భాషల్లోనూ నిరూపించుకోవాలనే పంతంతో ఉన్నారు. ఇక ఇరుగు పొరుగు స్టార్లకు మన పరిశ్రమలో కావాల్సినంత ప్రోత్సాహం ఉంది.

టాలీవుడ్ లో ప్రభాస్ పాన్ ఇండియా ట్రెండ్ ని పీక్స్ కి తీసుకెళ్లడంలో పెద్ద సక్సెసయ్యారు. ఆ క్రమంలోనే మహేష్.. అల్లు అర్జున్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్ వంటి స్టార్లు పోటీబరిలోకొచ్చారు. వీరంతా ఉత్తర భారతదేశంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. సదరు హీరోలు నటించిన తదుపరి చిత్రాలు పాన్-ఇండియన్ రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. హిందీ బెల్ట్ అంతటా తెలుగు హీరోలకు ఇమేజ్ అంతకంతకు పెరుగుతోంది. మన సినిమాలపై వ్యామోహం స్పష్ఠంగా కనిపిస్తోంది. అందుకే మన హీరోలంతా పాన్ ఇండియా మంత్రాన్ని జపిస్తున్నారు.

ఇప్పుడు ఇదే రేస్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న #PSPK 27 పైనే అందరి గురి. పవన్ తొలిసారి పాన్ ఇండియా మార్కెట్ ను అన్వేషిస్తున్నాడు. స్పష్టంగా తాజా చిత్రాన్ని నాలుగు దక్షిణ భారత భాషలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అంతేకాదు రాబిన్ హుడ్ తరహా కథాంశాన్ని ఎంచుకోవడం పైగా కోహినూర్ వజ్రం నేపథ్యాన్ని కథలో చేర్చడంతో యూనివర్శల్ అప్పీల్ తెచ్చారు క్రిష్. అందుకు తగ్గట్టే విజువల్ వండర్ గా ఈ మూవీని ప్లాన్ చేశారు. అలాగే ఇందులో గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు పాపులర్ హీరోయిన్లు .. అందునా జాక్విలిన్ లాంటి హాట్ హీరోయిన్ ని ఎంపిక చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలీవుడ్ నుండి ఒక విలన్ ఈ మూవీలో నటిస్తునున్నారు. అధికారికంగా ప్రతిదీ ప్రకటించాల్సి ఉంది. మొఘలుల కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి ఎ.ఎమ్.రత్నం రాజీకి రాకుండా పెట్టుబడులు పెడుతున్నారు.