బిగ్ బాస్ లో మళ్లీ నామినేట్ అయిన గంగవ్వ

0

బిగ్ వాస్ రెండో వారంలోకి ప్రవేశించింది. మొదటి వారం దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ కాగా.. కొత్త కమెడియన్ కుమార్ సాయి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండోవారం నిన్న సోమవారం మళ్లీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

బిగ్ బాస్ హౌస్ లో హీరోయిన్ మోనాల్ తో నటుడు అఖిల్ రోమాన్స్ మొదలైంది. ఇద్దరూ ఏకాంతంగా అర్థరాత్రుళ్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

రెండో వారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హౌస్ లోని మొత్తం 16మందిలో 9మందిని బిగ్ బాస్ నామినేట్ చేశారు. గార్డెన్ ఏరియాలో ఒక పడవను పెట్టి అందులో అందరినీ కూర్చండబెట్టి.. హారన్ వచ్చినప్పుడల్లా ఒకరు దిగిపోవాలని వారే ఈ వారం ఎలిమినేషన్ లో ఉంటారని చెప్పుకొచ్చాడు.

దీంతో అందరికంటే ముందుగా కాళ్లు నొప్పులు పెడుతున్నాయని గంగవ్వ దిగిపోయింది. ఆ తర్వాత నోయల్ సహా మోనాల్ సోహైల్ కుమార్ సాయి కళ్యాణి రాజశేఖర్హారిక అభిజిత్ ఇలా 9మంది దిగిపోయారు. వారే నామినేట్ అయినట్టు బిగ్ బాస్ ప్రకటించారు.

సుజాత మెహబూబ్ దివి అఖిల్ చివరిదాకా పడవలో ఉన్నారు. దీంతో వారు సేఫ్ అయ్యారు. ఈ 9 మందిలోంచి ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ కానున్నారు.